ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో తొలిసారిగా 20 జట్లు తలపడనున్నాయి. రేపు అంటే జూన్ 2 నుంచి జూన్ 29 వరకూ జరగనున్న మెగా టోర్నీని అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 ఏ ఫార్మట్‌లో జరుగుతుంది. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎన్ని గ్రూపులున్నాయనే వివరాలు పరిశీలిద్దాం.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 9వ సీజన్ ఇది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నాయి. డల్లాస్ వేదికగా జూన్ 2 అమెరికా వర్సెస్ కెనడా మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమౌతుంది. 17 ఏళ్ల టీ20 ప్రపంచకప్ చరిత్రలో 20 దేశాలు తలపడటం ఇదే తొలిసారి. తొలిదశలో టీ20 ప్రపంచకప్ 2024 వెస్టిండీస్-అమెరికా దేశాల్లో సంయుక్తంగా జరగనుంది. ఇక రెండవ దశలో సూపర్ 8 జట్లతో పూర్తిగా వెస్డిండీస్లోనే జరగనుంది. మొదటి దశలో 20 జట్లలో ఒక్కొక్క గ్రూపుకు 5 దేశాల చొప్పున 4 గ్రూపులుంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్‌లో ఉన్న 2 జట్ల చొప్పున మొత్తం 8 జట్లతో సూపర్ 8 ఉంటుంది. ఇక సూపర్ 8 రౌండ్లో 4 జట్ల చొప్పున రెండు గ్రూపులు డివైడ్ అవుతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. జూన్ 29వ తేదీన రెండు సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు విజయం సాధిస్తాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 గ్రూపులు-దేశాలు
గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, ఐర్లండ్, కెనడా, అమెరికాలున్నాయి. ఇక గ్రూప్ బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లండ్, ఒమన్ దేశాలున్నాయి. ఇక గ్రూప్ సిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలున్నాయి. గ్రూప్ డిలో బంగ్లాదేశ్, ఉగాండ, నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, నేపాల్ దేశాలున్నాయి.
జూన్ 2 నుంచి జూన్ 18 వరకూ గ్రూప్ దేశాల మధ్య మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తరువాత జూన్ 19 నుంచి జూన్ 25 వరకూ సూపర్ 8 దేశాల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. చివరి దశ జూన్ 27 నుంచి జూన్ 29 వరకూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలు, 5 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారమౌతాయి. అటు దూరదర్శన్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook