Usain Bolt: ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 2024 జరుగుతోంది. ఇది పూర్తయిన రోజుల వ్యవధిలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీకు జమైకా స్పీడ్ రన్నర్ ఉసేన్ బోల్ట్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టోర్నీని అమెరికా, వెస్డిండీస్ దేశాలు నిర్వహిస్తున్నాయి. మెగా క్రికెట్ టోర్నీకు అమెరికా ఆతిధ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. అమెరికాలో కూడా క్రికెట్ విస్తరింపచేసేందుకు ఐసీసీ చాలా కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈసారి టీ20 ప్రపంచకప్ ఆతిద్యాన్ని వెస్డిండీస్‌తో పాటు అమెరికాకు అప్పజెప్పింది. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా జమైకన్ స్పీడ్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్‌ను ఐసీసీ నియమించింది. ఒలింపిక్స్‌లో ఉస్సేన్ బోల్ట్ 8 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు.
అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం చాలా అనందంగా ఉందంటన్నాడు ఉస్సేన్ బోల్ట్. ఉస్సేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం వల్ల క్రికెట్ మరిన్ని దేశాలకు పరిచయం అవుతుందనేది ఐసీసీ ఆలోచనగా ఉంది.
వచ్చే వారం టీ20 ప్రపంచకప్ అధికారిక ప్రచార గీతం మ్యూజిక్ వీడియోని ఇతర కళాకారులతో కలిసి ఉస్సేన్ బోల్డ్ విడుదల చేయనున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 29 వరకూ జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా ఉస్సేన్ బోల్ట్ హాజరుకానున్నాడు. అమెరికాలో క్రికెట్ ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాడు. తాను క్రికెటర్ కాకపోయినా క్రికెట్ ఆట తన దేశంలో ఓ భాగమన్నాడు ఉస్సేన్ బోల్ట్.
Also read: T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook