Glenn Maxwell Marriage: భారతీయురాలిని పెళ్లాడిన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్.. ఫొటోలు వైరల్!

Glenn Maxwell Marriage: ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పెళ్లి పీటలెక్కాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్ అనే యువతిని ప్రేమించి.. పెళ్లాడాడు. వీరిద్దరి వివాహవేడుక సందర్భంగా పలువురు క్రికెటర్లు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 02:43 PM IST
    • పెళ్లి పీటలెక్కిన ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్
    • తమిళనాడుకు చెందిన వినీ రామన్ తో వివాహం
    • శుభాకాంక్షలు తెలుపుతున్న క్రికెటర్లు, అభిమానులు
Glenn Maxwell Marriage: భారతీయురాలిని పెళ్లాడిన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్.. ఫొటోలు వైరల్!

Glenn Maxwell Marriage: ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఓ ఇంటివాడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కు ముందు తన ప్రేయసి, తమిళనాడుకు చెందిన వినీ రామన్ ను శుక్రవారం పెళ్లాడాడు. ఈ సందర్భంగా మాక్సెవెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపింది. దీంతో పాటు పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు మ్యాక్స్ వెల్ కు మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ కొత్తజంట. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఏళ్లపాటు ప్రేమలో..

గత కొంతకాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ కరోనా లాక్ డౌన్ కు ముందు 2020 ఫిబ్రవరిలో మ్యాక్ వెల్, వినీ రామన్ నిశ్చితార్థం జరుపుకొన్నారు. అప్పుడు ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. తాను త్వరలోనే ఓ ఇంటివాడ్ని కాబోతున్నాని మ్యాక్ వెల్ చెప్పుకొచ్చాడు. అయితే అంతలోనే కరోనా కేసులు క్రమంగా పెరిగిన కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ కారణంగా వీరిద్దరి వివాహం రెండేళ్ల పాటు వాయిదా పడింది. 

ఇప్పుడు దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండడం వల్ల పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకొని శుభలేఖలు తమ బంధుమిత్రులకు పంచారు. ఈ క్రమంలో మ్యాక్స్ వెల్, వినీ రామన్ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VINI (@vini.raman)

ఎవరీ వినీ రామన్?

భారతదేశంలోని తమిళనాడుకు చెందిన వినీ రామన్.. ఉన్నతవిద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. ఆ తర్వాత మెల్ బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ఇప్పుడు ప్రణయంగా మారింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ హనీమూన్ కు వెళ్తారని తెలుస్తోంది. 

Also Read: Team India Best Captain: టెస్టు ఫార్మాట్ లో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఉత్తమ కెప్టెన్?

Also Read: Rajasthan Royals Captain: బ్రేకింగ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా యుజ్వేంద్ర చాహల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News