Ravi Shastri on Umran Malik: ఉమ్రాన్ మాలిక్‌ను అప్పుడే ప్రయోగించొద్దు..భారత మాజీ కోచ్ సూచనలు..!

Ravi Shastri on Umran Malik: ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈనేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 11, 2022, 09:00 PM IST
  • ఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్
  • కీలక సూచనలు చేసిన రవిశాస్త్రి
  • ఉమ్రాన్‌ మాలిక్‌ను అప్పుడే ఆడించొద్దన్న మాజీ కోచ్
Ravi Shastri on Umran Malik: ఉమ్రాన్ మాలిక్‌ను అప్పుడే ప్రయోగించొద్దు..భారత మాజీ కోచ్ సూచనలు..!

Ravi Shastri on Umran Malik: ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈనేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. రాబోయే ప్రపంచ క్రికెట్‌ పోటీలో జమ్మూకాశ్మీర్‌ యువ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ను జట్టులోకి తీసుకోకూడదన్నారు. అతడు ఇంకా నేర్చుకోవాలని..అప్పుడే టీమ్‌లోకి తీసుకోవద్దని అన్నారు. మాలిక్‌ను జట్టుతో పంపించండి కానీ..అప్పుడే ఆడించడం వల్ల ఉపయోగం కల్గదని వెల్లడించారు.

మాలిక్ నేర్చుకునేందుకు ఎంతో సమయం ఉందన్నారు. ఉమ్రాన్‌కు వన్డేలు, టెస్ట్‌లు ఆడే అవకాశం ముందు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత పొట్టి ఆటలోకి తీసుకోవాలన్నారు రవిశాస్త్రి. ఇటీవల ఐపీఎల్‌లో హైదరాబాద్ తరపున ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణించాడు. అత్యంత వేగంగా బంతులు విసరడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించాడు. 14 మ్యాచ్‌ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌ ప్రతి మ్యాచ్‌లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 157 కిలోమీటర్ల వేగంతో బంతి వేశాడు. ఇలా తన బౌలింగ్‌తో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అందరూ ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లో అతడికి అవకాశం దక్కలేదు. రెండో టీ20లో అవకాశం ఉంటుందని పలువురు క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. రేపు కటక్‌ వేదికగా భారత్,దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Also read: India vs South Africa: రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..టీమిండియా తుది జట్టు ఇదే..!

Also read:Prathyusha Garimella: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ ప్రత్యూష బలవన్మరణం..కారణాలు ఇవేనా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News