Irfan Pathan: రెండోసారి తండ్రయిన ఇర్ఫాన్ పఠాన్.. కొడుక్కి ఏం పేరు పెట్టారంటే..

Irfan Pathan blessed with baby boy: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రెండోసారి తండ్రయ్యాడు. ఇర్ఫాన్-సఫా బేగ్ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 28) కొడుకు పుట్టాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 10:59 AM IST
  • రెండోసారి తండ్రయిన ఇర్ఫాన్ పఠాన్
  • ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన పఠాన్
  • కొడుక్కి సులేమాన్ ఖాన్ అని నామకరణం
Irfan Pathan: రెండోసారి తండ్రయిన ఇర్ఫాన్ పఠాన్.. కొడుక్కి ఏం పేరు పెట్టారంటే..

Irfan Pathan blessed with baby boy: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రెండోసారి తండ్రయ్యాడు. ఇర్ఫాన్-సఫా బేగ్ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 28) కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కొడుకుని చేతుల్లో ఎత్తుకుని ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. కొడుక్కి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు.

ఇర్ఫాన్ పఠాన్, సఫా బేగ్ దంపతులకు ఫిబ్రవరి 4, 2016లో వివాహం జరిగింది. డిసెంబర్ 20, 2016లో ఈ దంపతులకు మొదటి కొడుకు పుట్టాడు. అతనికి ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అని పేరు పెట్టారు. కెరీర్ విషయానికొస్తే... ఇర్ఫాన్ పఠాన్ 2020లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి క్రికెట్ అనలిస్టుగా మారిపోయాడు. ఇటీవల ప్రముఖ ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ మొహమదీన్ స్పోర్టింగ్ ఎస్సీ ఇర్ఫాన్ పఠాన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరుపున ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2006లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్ ఇర్ఫానే కావడం విశేషం. కేవలం బౌలర్‌ గానే కాదు ఆల్‌రౌండర్‌గా ఇర్ఫాన్ రాణించాడు. క్రికెట్‌ను (Indian Cricket Team) పక్కనపెడితే ఇర్ఫాన్‌లో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. గతంలో 'జలక్ దిక్లాజా' అనే రియాలిటీ షోలో తన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. కోబ్రా అనే కోలీవుడ్ సినిమా ద్వారా ఇర్ఫాన్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

Also Read: Auto Rides: కొత్త సంవత్సరంలో ఆటో రైడ్స్‌పై జీఎస్టీ.. సామాన్యులపై మరో భారం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News