Rishabh Pant's Money Looted: యాక్సిడెంట్ అయి పడి ఉంటే రిషబ్ పంత్ డబ్బు లూటీ చేశారా?

Rishabh Pant's money looted: రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయి పడి ఉంటె ఆయనను కాపాడాల్సిన వారు అతని డబ్బు లూటీ చేశారు అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా దానిపై క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 31, 2022, 05:44 PM IST
Rishabh Pant's Money Looted: యాక్సిడెంట్ అయి పడి ఉంటే రిషబ్ పంత్ డబ్బు లూటీ చేశారా?

Fact Check on Rishabh Pant's money looted during car crash: ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్‌లో శుక్రవారం ఉదయం క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో కారులో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రిషబ్‌ కారు దిగేందుకు ప్రయత్నించినా పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి బయట అడుగు కూడా  వేయలేకపోయినా తర్వాత ఎలాగోలా అంబులెన్స్ కు ఫోన్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక రిషబ్ కారులో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం డబ్బులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయని, ఒక పక్క రిషబ్ బాధ పడుతూనే ఉన్నా  కొంతమంది రిషబ్‌కు సహాయం చేయడానికి బదులుగా వారి జేబులో నోట్లు నింపుకోవడం అలాగే రిషబ్ ను వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక హరిద్వార్ పోలీసులు ఈ ప్రచారాన్ని ఖండించారు.

ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స సమయంలో, సూట్‌కేస్ కాకుండా, కారుతో పాటు అన్ని వస్తువులు కాలిపోయాయని రిషబ్ స్వయంగా చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఇక ఘటనా స్థలం నుంచి లభించిన నగదు, ప్లాటినం గొలుసు, బ్రాస్‌లెట్‌ను రిషబ్‌ ఎదుట ఆస్పత్రిలో ఉన్న అతని తల్లికి అందజేశామని అన్నారు. ఇక మరోవైపు 500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని రిషబ్‌కు సహాయం చేసేందుకు అక్కడికి చేరుకున్న యువకుడు రజత్ చెబుతున్నాడు, ప్రజలు వాటిని ఏరుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఇద్దరు యువకులు దేవుడి దూతలులాగా ముందుకు వచ్చి రిషబ్ పంత్‌ను రూర్కీలోని సక్షమ్ హాస్పిటల్‌లో చేర్చారు. 25 ఏళ్ల పంత్ తన తల్లిని ఆశ్చర్యపరిచేందుకు తన మెర్సిడెస్ కారును రూర్కీలోని తన ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. అయితే ఈ ప్రమాదం కారణంగా పంత్ కోరిక నెరవేరలేదు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 5.22 గంటలకు జరిగిందని హరిద్వార్ ఎస్‌ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు.

ఆయన చెబుతున్న వివరాల ప్రకారం, ఢిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో, రిషబ్ పంత్ కారు వెంటనే బోల్తా పడి మంటలు చెలరేగాయి, ఇక ప్రమాదం జరిగిన తర్వాత రిషబ్ పంత్ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. అలాగే ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ఐపీఎల్ 2023, ఆస్ట్రేలియా సిరీస్‌కు పంత్ దూరం.. తెలుగు ఆటగాడికి కీపింగ్ బాధ్య‌త‌లు!

Also Read: The Pope Benedict XVI Passed Away:విషాదంలో కాథలిక్కులు.. 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News