Canada Tennis player Eugenie Bouchard Bikini ID Card: ఓ విద్యార్థి లేదా ఉద్యోగస్తుడికి ఐడీ కార్డు తప్పనిసరి. ఐడీ కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. అదే విధంగా కొన్ని క్రీడల్లో కూడా ఐడీ కార్డు తప్పనిసరి. క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, హాకీ లాంటి గ్రూఫ్ క్రీడలకు ఐడీ కార్డులు లేకపోయినప్పటికి.. టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్ లాంటి క్రీడల్లో ఐడీ కార్డులు తయారు చేస్తారు. ఐడీ కార్డులు ఉంటేనే ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. ఈ ఐడీ కార్డు కారణంగానే కెనడా మహిళా టెన్నిస్ ప్లేయర్ యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది.
వాంకోవర్‌లో ఓల్డమ్ బ్రౌన్ వాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు తాజాగా కెనడా మహిళా ప్లేయర్ యూజీనీ బౌచర్డ్ వచ్చారు. తొలి రౌండ్ మ్యాచ్ సమయంలో బౌచర్డ్ తన ఐడీ కార్డు చూసుకుని షాక్ అయ్యారు. ఐడీ కార్డుపై బౌచర్డ్ సాధారణ ఫోటో కాకుండా.. టూ పీస్ బ్లాక్ స్విమ్‌సూట్ ధరించి ఉన్న ఫోటో ఉంది. స్విమ్‌సూట్‌లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను ఓల్డమ్ బ్రౌన్ వాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అధికారులు వాడడం అందరిని ఆశ్చర్యపరిచింది.
2018లో ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు సంబంధించి కవర్ షూట్ కోసం యూజీని బౌచర్డ్ ఈ స్విమ్‌సూట్ ధరించారు. ఆ ఫొటో ఐడీ కార్డుపై ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అయితే ఈ ఫొటోపై బౌచర్డ్ ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. ఫన్నీగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐడీ కార్డు ఫోటోను షేర్ చేసి.. ఈ ఫొటోనే ఎందుకు వాడారో చెప్పాలని ప్రశ్నించారు. 'హ్యూజీని బౌచర్డ్.. డబ్ల్యూటీఏ ప్లేయర్. ఓల్డమ్ బ్రౌన్ వాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అధికారులకు ఒక ప్రశ్న. ఈ ఫోటో ఎందుకు వాడారో దయచేసి నాకు వివరణ ఇవ్వండి' అంటూ కెనడా ప్లేయర్ పేర్కొన్నారు. చివరకు ఐడీ ఫొటో మార్చారు అధికారులు.
1994 ఫిబ్రవరి 25న కెనడాలోని మాంట్రెల్లో హ్యుజీని బౌచర్డ్ జన్మించారు. చిన్నతనం నుంచి టెన్నిస్‌పై ఉన్న ఆసక్తితో పాఠశాల నుంచే టెన్నిస్ రాకెట్ చేతపట్టారు. 2009లో ప్రొఫేషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 28 ఏళ్ల హ్యుజీని బౌచర్డ్ 2014లో వింబుల్డన్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచారు. వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన తొలి కెనడా టెన్నిస్ ప్లేయర్‌గా బౌచర్డ్ ఘనత అందుకున్నారు. ఆ తర్వాత భుజం గాయంతో చాలా కాలం టెన్నిస్ ఆటకు ఆమె దూరంగా ఉన్నారు. ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టి మైదానంలో దిగారు.
Also Read: కోహ్లీ సమస్యంతా అదే.. విరాట్‌కు బాల్ వేయడానికి ఏ బౌలర్ ఇష్టపడడు: చహల్
Also Read: Munawar Faruqui: మునావర్ ఫరూకి షోపై సస్పెన్స్..హైటెక్ సిటీలో 2 వేల మంది పోలీసుల పహారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook