Ben Stokes Brumbrella Felding: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ 2023 మొదటి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదిక జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఆఖరి రోజు 174 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ గెలుపొందాలంటే 7 వికెట్లు తీయాలి. అంతకుముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కంగారూ జట్టు ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫీల్డింగ్ సెటప్‌తో క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు. వెరైటీ ఫీల్డింగ్ సెటప్‌తో ఆస్ట్రేలియా ఓపెనర్, సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా (141)కు ఉచ్చు బిగించి క్లీన్‌బౌల్డ్ అయ్యేలా చేశాడు. భారీ సెంచరీతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను నిలబెట్టిన ఖవాజా.. క్రీజ్‌లో పాతుకుపోయాడు. దీంతో ఖవాజాను ఔట్ చేసేందుకు స్టోక్స్ మాస్టర్ ప్లాన్ వేశాడు.
113వ ఓవర్ ఆలీ రాబిన్సన్ చేతికి బంతి అప్పగించిన స్టోక్స్.. ఖవాజాపై ఒత్తిడి తెచ్చేందుకు 30 యార్డ్ సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్‌లను క్యాచింగ్ పొజిషన్లలో ఉంచాడు. స్లిప్ తరహాలో బ్యాట్స్‌మెన్ ముందు లెగ్ సైడ్ ముగ్గురు.. ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లను మోహరించాడు. బౌలర్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీ వేయాలని సూచించాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ను చూసిన ఖవాజా.. డెలివరీపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. విచిత్రమైన ఫీల్డ్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. స్టోక్స్ చెప్పినట్లే రాబిన్సన్ బాల్ వేయగా.. ఖవాజా లెంగ్త్ కొంచెం వెనక్కి పిచ్ అవుతుందని భావించి ట్రాక్‌లో పడిపోయాడు. క్రీజ్ దాటి ముందు షాట్ ఆడేందుకు యత్నించగా.. బాల్ నేరుగా వికెట్లను పడగొట్టేసింది. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఖవాజా ఔట్ అవ్వడంతోనే ఇంగ్లాండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో కాస్త ఆధిక్యం దక్కింది.
Only in Test Cricket 😍
An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv
— Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023
ఉస్మాన్ ఖవాజా ఔట్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ తెలివిని మెచ్చుకుంటున్నారు. దీనికి 'బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్' అని పేరు కూడా పెట్టేశారు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ను బాక్స్ క్రికెట్‌తో పోల్చారు. ఇక స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ ఇతర జట్లకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే బజ్‌బాల్ పేరుతో టెస్ట్ క్రికెట్‌లో వేగంగా పరుగులు చేసే కొత్త పద్ధతిని పరిచయం చేసింది. ఇప్పుడు సరికొత్త ఫీల్డింగ్ సెటప్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. క్రికెట్‌ను ఇలా కూడా ఆడొచ్చా అనే రీతిలో స్టోక్స్ కెప్టెన్సీ చేస్తున్నాడు.
Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన
Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి