ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు

Ben Stokes Creates History: ఐర్లాండ్‌తో బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా మ్యాచ్‌ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృస్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 5, 2023, 08:18 AM IST
ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు

Ben Stokes Creates History: లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ జట్టు 172 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. అనంతరం ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 524 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటించిన ఐర్లాండ్.. 362 రన్స్‌ చేసి ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది.

ఇంగ్లాండ్ ముందు 12 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. వికెట్ కోల్పోకుండా ఇంగ్లిష్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. తొలి ఓవర్‌లోనే నాలుగు బంతుల్లో మూడు బంతుల్లో క్రేవ్లీ మూడు బౌండరీలు బాదాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆకట్టుకుంది. 

తొలి ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఐర్లాండ్ 172 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లాండ్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ఒలీ పోప్ తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. బెన్ డకెట్ (182) కూడా తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ జట్టు 362 పరుగులు చేసింది. మార్క్ అదైర్ (88), ఆండీ మైబ్రెయిన్ (86), హ్యారీ టెక్టార్ (51) రాణించారు.

Also Read: Bihar Bridge Collapse: నిర్మాణంలోనే గంగా నదిలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియోలు వైరల్  

ఇక ఈ మ్యాచ్‌ ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లేదా కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన మొదటి టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. నాల్గో వికెట్ తరువాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు వారాల్లోపు ప్రారంభం కానున్న రాబోయే యాషెస్ సిరీస్‌కి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించింది. జింబాబ్వేలో వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లకు సన్నద్ధం కావడానికి ఐర్లాండ్ ఈ గేమ్‌ను ఉపయోగించుకుంది.

Also Read: PF Withdrawal: పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News