Eng vs Aus 1st Test Highlights: థ్రిల్లింగ్ పోరులో ఆస్ట్రేలియా విక్టరీ.. గొప్పగా పోరాడిన పాట్ కమిన్స్

Australia Won 1st Test Ashes 2023: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించి తొలి టెస్టును సొంతం చేసుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా ఆడిన ఉస్మాన్ ఖవాజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 21, 2023, 06:56 AM IST
Eng vs Aus 1st Test Highlights: థ్రిల్లింగ్ పోరులో ఆస్ట్రేలియా విక్టరీ.. గొప్పగా పోరాడిన పాట్ కమిన్స్

Australia Won 1st Test Ashes 2023: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి కొట్టింది. అసలు సిసలు టెస్ట్ మ్యాచ్‌ మజాను అందిస్తూ.. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 2 వికెట్లతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై కంగారూ జట్టు జయభేరి మోగించింది. కష్టసమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఉస్మాన్ ఖవాజా (65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్డ్ 3, ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

చివరి రోజు ఆసీస్ విజయానికి 174 పరుగులు.. ఇంగ్లాండ్ గెలుపునకు 7 వికెట్లు కావాలి. ఇరు జట్లకు విజయ అవకాశాలు సమానంగా ఉన్నాయి. అయితే ఊహించని రీతిలో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో డ్రాగా ముగుస్తుందని అందరూ భావించారు. రెండో సెషన్ నుంచి చివరి రోజు ఆట ప్రారంభమైంది. తొలి ఏడు ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా, బోలాండ్ దీటుగా ఎదుర్కొన్నారు. 

అయితే బోలాండ్‌ (20)ను బ్రాడ్ ఔట్ చేయగా.. హెడ్‌ (16)ను మొయిన్ అలీ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులకు చేరింది. ఓ ఎండ్ ఖవాజా పాతుకుపోగా.. గ్రీన్‌ చక్కటి సహకారం అందించాడు. ఆస్ట్రేలియా పటిష్టస్థితికి చేరిన సమయంలో 192 పరుగుల వద్ద గ్రీన్‌ (28)ను రాబిన్సన్‌ క్లీన్ బౌల్డ్‌ చేశాడు. కాసేటికే ఖవాజా (65)ను  స్టోక్స్‌ ఔట్ చేయడంతో మ్యాచ్ ఇంగ్లాండ్‌ వైపు మొగ్గింది. అప్పటికి ఆసీస్ స్కోరు 209. 

అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్‌ ఇంగ్లాండ్ బౌలర్లను పరీక్షించారు. విజయానికి చేరువ అవుతున్న క్రమంలో 227 పరుగుల వద్ద కేరీ (20)ను రూట్‌ ఔట్‌ చేసి.. మరింత ఉత్కంఠగా మార్చాడు. ఈ సమయంలో కమిన్స్ గొప్పగా పోరాడాడు. స్పిన్నర్ నాథన్ లైయన్ (17) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివర్లో ఇంగ్లిష్‌ బౌలర్లు వికెట్లు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా.. ఈ జంట ఏ మాత్రం బెదరలేదు. 9 వికెట్‌కు అజేయంగా 54 జోడించి గెలిపించారు. కమిన్స్ బౌండరీతో ఆసీస్‌కు తొలి టెస్టు విజయాన్ని అందించాడు. ఉస్మాన్ ఖవాజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 393 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ 118 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లైయన్ 4 వికెట్లు తీయగా, జోష్ హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీశారు. అనంతరం కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (141) భారీ శతకం బాదాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో మూడు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 273 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాథన్ లైయన్, పాట్ కమిన్స్ చెరో 4 వికెట్లు తీశారు. అనంతరం 281 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు వికెట్లు మిగిలి ఉండగా.. కంగారూ జట్టు ఛేదించి తొలి టెస్టును సొంతం చేసుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 28 నుంచి ప్రారంభంకానుంది. 

Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన  

Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News