Dwayne Bravo Pushpa Walk: పుష్పరాజ్ మేనరిజానికి విండీస్ వీరుడు ఫిదా.. మైదానంలో స్టెప్పులేసి అలరించాడుగా (వీడియో)!!

Dwayne Bravo Dance to Srivalli song. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో 'పుష్ప' సినిమాలోని శ్రీవల్లీ పాటకు స్టెప్పులేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 04:02 PM IST
  • ప్రపంచానికి 'పుష్ప మేనియా'
  • శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన డ్వేన్ బ్రావో
  • అల్లు అర్జున్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న డ్వేన్ బ్రావో
Dwayne Bravo Pushpa Walk: పుష్పరాజ్ మేనరిజానికి విండీస్ వీరుడు ఫిదా.. మైదానంలో స్టెప్పులేసి అలరించాడుగా (వీడియో)!!

Dwayne Bravo Pushpa Walk: ప్రస్తుతం ప్రపంచానికి 'పుష్ప మేనియా' పట్టుకుంది. కొంతమంది 'తగ్గేదే లే' అంటూ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) మేనరిజం చూపిస్తుంటే.. మరి కొంతమంది పుష్ప (Pushpa Songs) పాటలకు తమదైన శైలిలో స్టెప్పులేస్తున్నారు. ముఖ్యంగా శ్రీవల్లీ, ఊ అంటావా మావ పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, షకీబ్ అల్ హసన్ శ్రీవల్లీ పాటకు డాన్స్ చేయగా.. తాజాగా ఆ లిస్టులో డ్వేన్ బ్రావో (Dwayne Bravo) చేరాడు. 

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో 'పుష్ప: ది రైజింగ్' (Pushpa)లోని శ్రీవల్లీ పాటకు డాన్స్ చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం అంకాన్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించ‌గా.. అది కాస్త ఫీల్డ‌ర్ చేతికి వెళ్లింది. వికెట్ తీసిన సంతోషంలో బ్రావో శ్రీవల్లి పాట‌కు స్టెప్ (Dwayne Bravo Pushpa Walk) వేశాడు.

Also Read: Father - Daughter Love: కూతురికి బ్రెయిన్ సర్జరీ.. తండ్రి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్‌ని కొంత వరకు కాపీ కొట్టడంలో డ్వేన్ బ్రావో సక్సెస్ అయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పుష్ప చిత్రంలోని పాటకు (Srivalli Song) సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతని కుమార్తెలు ఇండిరే, ఇవి మే కూడా డ్యాన్స్‌ చేశారు. వార్నర్ స్వయంగా ఒక వీడియోను రూపొందించారంటే.. ఈ సినిమా ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: 83 Movie OTT Relase: ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 83 మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News