మొహాలీ వన్డే తర్వాత ధోనీ రిటైర్మెంట్?

ధోనీ రిటైరవుతున్నారు. అందుకు వేదిక మొహాలీ స్టేడియం కాబోతుంది. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ లో భాగంగా డిసెంబర్ 13వ తేదీ మొహాలీలో రెండో వన్డే జరగనుంది.

Last Updated : Dec 5, 2017, 03:39 PM IST
మొహాలీ వన్డే తర్వాత ధోనీ రిటైర్మెంట్?

ధోనీ రిటైరవుతున్నారు. అందుకు వేదిక మొహాలీ స్టేడియం కాబోతుంది. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ లో భాగంగా డిసెంబర్ 13వ తేదీ మొహాలీలో రెండో వన్డే జరగనుంది. అక్కడ ధోనీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు సర్వం సిద్ధం చేశారు. 

ఏంటీ? నమ్మశక్యంగా లేదా? నిజమండీ బాబోయ్ ..! అయితే మీరనుకుంటున్నట్లు ఈ ధోనీ మన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాదండోయ్. రిటైర్మెంట్ అవుతున్నది స్నిఫర్ అనే డాగ్. ఇది  గత పది సంవత్సరాలుగా మొహాలీ భద్రతలో సేవలు అందించింది. మొహాలీ పోలీసుల బృందంలో స్నిఫర్ అనే డాగ్ కూడా ఒకటి. ఇది వారితో కలిసిపోయింది. ధోనీతో పాటు మరో రెండు పోలీస్ జాగిలాలు ప్రీతి, జాన్ కూడా రిటైర్ అవుతున్నారని అధికారులు వెల్లడించారు. 

Trending News