Dhanashree Verma teasing Yuzvendra Chahal after hat-trick wickets in RR vs KKR match: భారత క్రికెట్ జట్టు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చహల్‌కు స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా కాస్త ఎక్కువే. మ్యాచ్ జరుగుతుండగానే తన అల్లరి పనులతో సహచరులను ఆటపట్టిస్తుంటాడు. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానెల్‌లో భారత ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులకు వినోదాన్ని అందిస్తాడు. అందుకే మనోడికి 'అల్లరి పిల్లాడు' అనే బిరుదు కూడా ఉంది. అయితే ఎప్పుడూ ఇతరులని ఇంటర్వ్యూ చేసే యూజీని ఈసారి అతడి సతీమణి ధనశ్రీ వర్మ చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అద్భుత బౌలింగ్ చేశాడు. హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతరాత్రి యూజీ తన కోటా 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 17వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్, శివమ్ మావి, ప్యాట్ కమిన్స్‌ను వరుస బంతుల్లో ఔట్ చేసి.. మెగా టోర్నీలో తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దాంతో స్టేడియంలో ఉన్న చహల్ సతీమణి ధనశ్రీ వర్మ చందులేసింది.
భర్త యుజ్వేంద్ర చహల్ హ్యాట్రిక్‌ను ధనశ్రీ వర్మ రాజస్థాన్ జట్టు ప్రతినిధులతో సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాట్రిక్ నేపథ్యంలో చహల్‌ను ధనశ్రీ సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఫన్నీ ప్రశ్నలతో ఆటాడుకుంది. నేను బయో బబుల్ నుంచి బయటకు వచ్చేశాను కదా.. ఎలా ఫీలవుతున్నావ్? అని ధనశ్రీ ప్రశ్నించగా.. చాలా అద్భుతంగా ఉందని చహల్ సమాధానం ఇచ్చాడు. హ్యాట్రిక్ వికెట్లు పడ్డాయని సంతోషంగా కన్పిస్తున్నావ్ అని అడగ్గా.. తొలి హ్యాట్రిక్ కదా అని యూజీ బదులిచ్చాడు.
Yuzi khush, Bhabhi khush aur hum bhi khush. Truly a “hat-trick day” 💗😁#Royalsfamily | @yuzi_chahal pic.twitter.com/swkKSiUr3E
— Rajasthan Royals (@rajasthanroyals) April 18, 2022
ధనశ్రీ వర్మతో పాటు ఆమె పక్కనే ఉన్న రాజస్తాన్ రాయల్స్ ప్రతినిధులు.. 'ఐదు వికెట్లు తీశావు.. పర్పుల్ క్యాప్ తిరిగి వచ్చేసింది. గ్రేట్' అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 'యూజీ సంతోషంగా ఉన్నాడు.. వదిన ఆనందంగా ఉంది. మేము అయితే ఫుల్ ఖుషీ. వాట్ ఏ హ్యాట్రిక్' అంటూ కాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Petrol price: దేశంలో పెట్రోల్ రేటు ఏ ప్రాంతంలో తక్కువ? ఎక్కడ ఎక్కువ రేటు?
Also Read: Ryan Campbell Heart Attack: ప్రముఖ హెడ్ కోచ్‌కు గుండెపోటు..లండన్ లోని హాస్పిటల్‌లో చేరిక..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook