DC vs CSK match highlights: ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపె గెలిచిన ఢిల్లీ.. IPL 2021 లో అగ్రస్థానం

Delhi Capitals vs Chennai Super Kings match చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతకు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విజయ పరంపరను అలాగే కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది.

Last Updated : Oct 5, 2021, 08:25 AM IST

Delhi Capitals vs Chennai Super Kings match చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతకు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విజయ పరంపరను అలాగే కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన ఢిల్లీ 10 మ్యాచుల్లో విజయం సాధించింది. ఐపిఎల్ 2021 (IPL 2021) దుబాయ్ షెడ్యూల్లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన 50వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టేన్ రిషబ్ పంత్ (Rishabh Pant) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టులో అంబటి రాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వరుసగా విఫలమయ్యారు. మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అంబటి రాయుడు (Ambati Rayudu) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ మాత్రమైనా చేయగలిగింది. 

Also read : KKR vs SRH match Highlights: కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి అట్టడుగుకు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. 137 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కూడా తడబడుతూ ఆడటంతో విజయం ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ కనిపించింది. శిఖర్ ధావన్ 39 (Shikhar Dhawan), షిమ్రన్ హెట్మెయిర్ 28 (నాటౌట్) పరుగులతో రాణించారు. పృథ్వీషా 18, రిపల్ పటేల్ 18, కెప్టెన్ రిషభ్ పంత్ 15 పరుగులు చేశారు. దీంతో ఢిల్లీ జట్టు కిందామీదా పడుతూ చివరికి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. 

చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ..
స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ.. ఢిల్లీ జట్టు కూడా తడబడటంతో మ్యాచ్ చివర్లో మరో నాలుగు బంతులు మిగిలి ఉన్నాయనగా ఢిల్లీ జట్టు విజయానికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అదే సమయంలో అక్సర్ పటేల్ (5) అవుట్ అవడంతో విజయం ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కగిసో రబడ తొలి బంతినే ఫోర్ కొట్టడంతో విజయం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals vs Chennai Super Kings match) సొంతమైంది.

Also read : Rumours On Dhawan Second Marriage: శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? సోషల్ మీడియాలో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News