DC vs KKR IPL 2022: Delhi Capitals crush Kolkata Knight Riders: ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఆరు వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ వార్నర్ (42; 26 బంతుల్లో 8x4), రోవ్‌మెన్ పొవెల్ (33 నాటౌట్; 1x4, 3x6), అక్షర్ పటేల్ (24) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. హృతీష్ రాణా, సునీల్ నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే పృథ్వీ షా(0) ఔట్ అయ్యాడు. మూడో ఓవర్‌లో మిచెల్ మార్ష్ (13) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్ (22)తో కలిసి డేవిడ్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. అయితే డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేసిన ఉమేష్ యాదవ్ మూడో వికెట్‌ను పడగొట్టాడు.
ఆ వెంటనే లలిత్ యాదవ్‌ను సునీల్ నరైన్ ఔట్ చేయగా.. కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే అక్షర్ పటేల్.. రోవ్‌మన్ పొవెల్‌తో కలిసి విలువైన రన్స్ చేసి రనౌటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ (8 నాటౌట్)తో కలిసి పొవెల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓటమితో కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. విజయం సాధించిన ఢిల్లీ 8 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
A return to winning ways for the Delhi Capitals! 👏 👏
The Rishabh Pant-led side beat #KKR by 4 wickets & seal their 4⃣th win of the #TATAIPL 2022. 👍 👍
Scorecard ▶️ https://t.co/jZMJFLuj4h #DCvKKR pic.twitter.com/QCQ4XrJn0P
— IndianPremierLeague (@IPL) April 28, 2022
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ నితీష్ రాణా (57; 34 బంతుల్లో 3x 4, 4x 6), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42; 37 బంతుల్లో 4x4) రాణించారు. దేశీయ ప్లేయర్ రింకు సింగ్ (23) కీలక పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్ (3), వెంకటేశ్ అయ్యర్ (6) విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ (4/14) నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) మూడు వికెట్లు తీశాడు.
Also Read: Manoj Bajpayee on Bollywood: సౌత్ సినిమాలంటే.. బాలీవుడ్ నిర్మాతలు భయపడుతున్నారు: మనోజ్
Also Read: Tamannaah Bhatia Hot Pics: తమన్నా భాటియా బోల్డ్ ఫోటో షూట్.. ఎంత హాట్ గురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook