చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు ఎంఎస్ ధోనీ. ఐపీఎల్ 2020 (IPL 2020)లో భాగంగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా సీఎస్కే కెప్టెన్ ధోనీ నిలిచాడు.
వాస్తవానికి ఈ ఘనతను అందుకోవాల్సిన తొలి ఆటగాడు సురేష్ రైనా. కాగా ఈ సీజన్ ఆడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. సురేష్ రైనా ఐపీఎల్ 2020కు ముందే 193 మ్యాచ్‌లాడాడు. ఈ సీజన్‌లో సీఎస్కే 7వ మ్యాచ్ రైనాకు 200వ మ్యాచ్ అయ్యేది. రైనా ఉండి ఉంటే ధోనీ కన్నా రెండు మ్యాచ్‌లకు ముందే రైనా ఈ ఘనతను సాధించేవాడు.
కాగా, 200 ఐపీఎల్ మ్యాచ్‌ల (MS Dhoni 200 IPL Matches)తో ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ తర్వాత రోహిత్ శర్మ (197), సురేష్ రైనా (193), విరాట్ కోహ్లీ (186) ఉన్నారు. అత్యధిక విజయాలు అందుకున్న ఐపీఎల్ కెప్టెన్‌గా సైతం ధోనీదే రికార్డు. 100కు పైగా విజయాలలో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
MS Dhoni In IPL 2020: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. చెక్కు చెదరదు