బాల్ ట్యాంపరింగ్ కేసులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం

ఇటీవల కేప్ టౌన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి, ఆ నేరాన్ని అంగీకరించిన ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 

Last Updated : Mar 29, 2018, 01:01 AM IST
బాల్ ట్యాంపరింగ్ కేసులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం

ఇటీవల కేప్ టౌన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి, ఆ నేరాన్ని అంగీకరించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లని 12 నెలలపాటు క్రికెట్ నుంచి నిషేధిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇదే కేసులో భాగస్వామ్యం వున్న ఆసిస్ బ్యాట్స్‌మన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలపాటు నిషేధం విధిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. బాన్‌క్రాఫ్ట్ రూపొందించిన పథకం ప్రకారం బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడినట్టుగా స్టీవ్ స్మిత్ అంగీకరించాడు. దీంతో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై మరింత లోతైన దర్యాప్తునకు ఆదేశిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సుదర్‌ల్యాండ్ మీడియాతో మాట్లాడుతూ... ఏదేమైనా బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై తమ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తితో వుందని అన్నాడు. 

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన జేమ్స్... ఇకపై మళ్లీ క్రికెట్ ప్రేమికులకి క్రికెట్‌పై వున్న ఆదరణ, విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషిచేస్తామని అభిప్రాయపడ్డాడు.

Trending News