RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు బోణీ కొట్టిన సీఎస్కే, మరి ముంబై పరిస్థితి ఏంటి

RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ చేసింది. 4 వరుస ఓటముల అనంతరం ఓ విజయం ఊరటనిస్తోంది ఆ జట్టుకు. మరి ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2022, 06:50 AM IST
  • ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసిన సీఎస్కే
  • ఆర్సీబీపై 23 పరుగుల తేడాతో ఘన విజయం
  • పంజాబ్‌పై విజయంతో ముంబై తొలి విజయం సాధించేనా లేదా
 RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు బోణీ కొట్టిన సీఎస్కే, మరి ముంబై పరిస్థితి ఏంటి

RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ చేసింది. 4 వరుస ఓటముల అనంతరం ఓ విజయం ఊరటనిస్తోంది ఆ జట్టుకు. మరి ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి

ఐపీఎల్ 2022లో గత ఛాంపియన్లకు పెద్ద సమస్యే వచ్చిపడినట్టుంది. వరుస ఓటములతో అట్టడుగున నిలుస్తున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు కాస్త ఊరట. నాలుగు వరుస ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఎట్టకేలకు విజయం సాధించింది. అంటే సీఎస్కే 5 మ్యాచ్‌లు ఆడి నాలుగింట ఓడింది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఛాంపియన్‌లా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి..216 పరుగులు చేసింది. ఇందులో శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ ప్రధానంగా చెప్పుకోవల్సిందే. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. ఇక మరో బ్యాటర్ రాబిన్ ఊతప్ప సైతం ధాటిగా ఆడాడు. 50 బంతుల్లో 88 పరుగులు చేశాడు. 

ఇక ఆ తరువాత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, అనుజ్ రావత్‌లు ముందే వెనుదిరిగారు. మ్యాక్స్‌వెల్ మాత్రం ధాటిగా ఆడి 11 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఆర్సీబీని షెహబాజ్ అహ్మద్, సుయేష్ ప్రభుదేశాయ్‌లు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ధాటిగా ఆడారు. ప్రభు దేశాయ్ 18 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ కాగా, షెహబాజ్ అహ్మద్ 27 బంతుల్లో 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్ కాస్త ఆశలు పెంచినా...34 పరుగులకు అవుటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది. చెన్నై సూపర్‌కింగ్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి బోణీ కొట్టింది. 

చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టగలిగింది. మరి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్‌లు ఆడి..నాలుగింటా ఓడిపోయింది. ఇవాళ మూడవ విజయం కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్‌తో అదృష్టం పరీక్షించుకోనుంది. 

Also read: Corona Fourth Wave: కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఇండియాలో జూన్-జూలై నెలల్లో ఖాయమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News