Champions Trophy: పాక్‌కు షాక్, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మార్చిన ఐసీసీ, కొత్త షెడ్యూల్ ఇలా

Champions Trophy Schedule Change in Telugu: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంఫియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారింది. బీసీసీఐ అభ్యంతరం నేపధ్యంలో ఐసీసీ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 16, 2024, 05:40 PM IST
Champions Trophy: పాక్‌కు షాక్, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మార్చిన ఐసీసీ, కొత్త షెడ్యూల్ ఇలా

Champions Trophy Schedule Change in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. షెడ్యూల్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ చేర్చడంపై బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఐసీసీ కలగజేసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పీవోకేను తప్పించి కొత్త షెడ్యూల్ జారీ చేసింది. ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి, ఖైబర్ పఖ్తూంక్వా ప్రాంతాల్లో జరగనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో మార్పులు వచ్చాయి. వచ్చే ఏడాది అంటే 2025 నవంబర్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో పాకిస్తాన్ తొలుత పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా చేర్చింది. అంటే పీవోకేలో కూడా ఓ మ్యాచ్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలపెట్టింది. దీనిపై బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఐసీసీ కలగజేసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పీవోకేను తొలగించింది. వచ్చే ఏడాది నవంబర్ 16వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానుంది. భద్రతా కారణాలతో టీమ్ ఇండియా పాకిస్తాన్ వెళ్లకపోవడంతో కొన్ని మ్యాచ్‌లు ఇతర దేశాల్లో జరగనున్నాయి. 

నవంబర్ 16 ఇస్లామాబాద్
నవంబర్ 17 తక్షిలా, ఖాన్పూర్
నవంబర్ 18 ఆబోటాబాద్
నవంబర్ 19 ముర్రే
నవంబర్ 20 నథాయి గాలి
నవంబర్ 22-25 కరాచీ
నవంబర్ 26-28 ఆప్ఘనిస్తాన్
డిసెంబర్ 10-13 బంగ్లాదేశ్
డిసెంబర్15-22 దక్షిణాఫ్రికా
డిసెంబర్ 25-జనవరి 5 ఆస్ట్రేలియా
జనవరి 6-11 న్యూజిలాండ్
జనవరి 12-14 ఇంగ్లండ్
జనవరి 15-26 ఇండియా

Also read: IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News