ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 1 లక్ష, 25 వేల పిడకలతో భోగిమంట వేసి రికార్డు నమోదు చేశారు విజయవాడ కృష్ణలంక వాసులు. రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ముఖ్యఅతిధిగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం విశేషం. ఆవు పిడకలతో వేసే భోగి మంటల వలన పర్యావరణంలో కాలుష్యం తగ్గుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కృష్ణలంకలో ఏపిఆర్ఎం పాఠశాల వేదికగా జరిగిన 'సంక్రాంతి సంబరాలు' కార్యక్రమంలో ఆయన ఈ సందర్భంగా హరిదాసులను, గంగిరెద్దుల వారిని సత్కరించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఈ విధంగా భోగిమంటలు వేసిన వైనం ఎక్కడా లేదని.. ఈ ఏడాది సంక్రాంతి కార్యక్రమం అమరావతి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటుతుందని మంత్రి తెలియజేశారు.