BCCI: బీసీసీఐ సరికొత్త నిర్ణయం, ఇకపై మహిళా క్రికెటర్లకు సైతం సమాన వేతనం

BCCI: సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు బీసీసీఐ తెరదించింది. క్రికెట్‌లో ఉన్న లైంగిక వివక్షను పారద్రోలే నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫీజు విషయంలో చారిత్రాత్మక నిర్ణయం ఇది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2022, 03:51 PM IST
BCCI: బీసీసీఐ సరికొత్త నిర్ణయం, ఇకపై మహిళా క్రికెటర్లకు సైతం సమాన వేతనం

ప్రపంచమంతా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటు దేశంలో కూడా మహిళా క్రికెట్ క్రేజ్ ఉన్నా..వివక్ష మాత్రం చాలాకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడీ వివక్షకు తెరదించుతూ బీసీసీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వివరాలు ఇలా ఉన్నాయి.

మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్నా..సౌకర్యాలు, మ్యాచ్ ఫీజు విషయంలో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు దక్కడం లేదు. ఇప్పుడీ వివక్షను పారద్రోలేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ కార్యదర్సి జై షా వెల్లడించారు. ఇక నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది. వివక్షను తొలగించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని జై షా తెలిపారు. ఇక నుంచి పే ఈక్విటీ అమలు చేస్తామన్నారు. 

మహిళా క్రికెట్ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమన్నారు జై షా. లింగభేదం లేకుండా సమానంగా చెల్లించనున్నామన్నారు. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కు 3 లక్షల రూపాయలు చెల్లించనున్నామని బీసీసీఐ తెలిపింది. 

సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్ల మ్యాచ్ ఫీజు ఏ ప్లస్ కేటగరీ క్రికెటర్లకు ఏడాదికి 7 కోట్లు, ఏ కేటగరీలో ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగరీలో ప్లేయర్లకు 3 కోట్లు, సి కేటగరీ ప్లేయర్లకు 1 కోటి రూపాయలు అందుతోంది. అదే మహిళా క్రికెటర్లకు మాత్రం ఇందులో పదిశాతం మాత్రమే లభించేది. అంటే ఎ గ్రేడ్ ప్లేయర్లకు 50 లక్షలు, బి గ్రేడ్ ప్లేయర్లకు 30 లక్షలు, సి గ్రేడ్ ప్లేయర్లకు 10 లక్షల రూపాయలు వచ్చేది.

Also read: Irleland Team: పొట్టకూటి కోసం ఒకప్పుడు టాయ్‌లెట్స్ శుభ్రం చేసిన ఆ క్రికెట్ ప్లేయర్ ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News