KL Rahul: టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ

KL Rahul: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరిప్పుడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎవరనే విషయంపై చర్చ సాగుతుండగానే..కేఎల్ రాహుల్‌పై ఆ బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2022, 03:03 PM IST
 KL Rahul: టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ

KL Rahul: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరిప్పుడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎవరనే విషయంపై చర్చ సాగుతుండగానే..కేఎల్ రాహుల్‌పై ఆ బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమైంది. అటు టెస్ట్ సిరీస్, ఇటు వన్డే సిరీస్ రెండింటినీ కోల్పోయింది. టెస్ట్ సిరీస్ తరువాత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో టీమ్ ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి టీ20 ఫార్మట్, వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమవడంతో..బీసీసీఐ (BCCI) కేఎల్ రాహుల్‌కు పగ్గాలు వన్డే పగ్గాలు అప్పగించింది. అయితే వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా మరీ ఘోరంగా కోల్పోయింది.

విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్ట్ కెప్టెన్‌గా తప్పుకోవడంతో తదుపరి కెప్టెన్ టెస్ట్ ఫార్మట్‌లో ఎవరనేది ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. విరాట్ వంటి విజయవంతమైన కెప్టెన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనే ప్రశ్నలు విన్పించాయి. కొంతమందైతే రోహిత్ శర్మకే ఆ సత్తా ఉందని వాదిస్తున్నారు. మరోవైపు  కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ పేర్లు విన్పించాయి. టెస్ట్ కెప్టెన్సీ విషయంలో కేఎల్ రాహుల్‌కు (KL Rahul) ఉన్న అవకాశాల గురించి పీటీఐ ప్రతినిధి..బీసీసీఐ అధికారిని ప్రశ్నించాడు. దీనికతడు చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. అసలు కేఎల్ రాహుల్ ఏ కోణంలో నుంచైనా మీకు కెప్టెన్‌గా కన్పిస్తున్నాడా అని ఎదురు ప్రశ్నించాడు.

Also read: Ravi Shastri: టీమ్ ఇండియా మాజి కెప్టెన్ విరాట్ కోహ్లిపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News