మహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలను పరిశీలించాలని బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఏయూ)ను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) కోరింది.
మహమ్మద్ షమీ, అతని భార్య మధ్య టెలిఫోనిక్ సంభాషణల ఆడియో రికార్డింగ్ లను పరిశీలించాలని ఏసీఏయూకి నాయకత్వం వహించే మాజీ ఢిల్లీ పోలీసు చీఫ్ నీరజ్ కుమార్ ను సీవోఏ కోరింది.
పేసర్ మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ తీవ్రమైన ఆరోపణలు చేశాక.. బీసీసీఐ షమీ కాంట్రాక్టును హోల్డ్ లో ఉంచింది. కాంట్రాక్టు విషయం పరిష్కారం అయ్యాక.. ఏసీఏయూ వచ్చే వారం రోజుల్లో రిపోర్టులను అందించమని సీవోఏ కోరినట్లు డీఎన్ఏ నివేదించింది.
మహమ్మద్ షమీపై మూడు విషయాలపై విచారణ చేపట్టాలని నీరజ్ కుమార్ ను సీవోఏ కోరింది. మొదట 'మహమ్మద్ భాయ్', 'ఆలిశ్బా' ఎవరో, వారి చరిత్ర ఏంటో కనుక్కోండి. ఆలిశ్బా ద్వారా మహమ్మద్ భాయ్ డబ్బులను పంపించాడా?, షమీ ఆ డబ్బును అందుకున్నాడా? అనేది తెలుసుకోవాలని కోరింది.
'ఆడియో రికార్డింగ్ లో ఎండీ.షమీ అని ఉంది. అందులోని ఎం.డీ. షమీ ఎవరు?. ఎండీ. షమీకి మహమ్మద్ భాయ్ నుంచి పాకిస్తాన్ లోని ఆలిశ్బా అనే మహిళ ద్వారా డబ్బులు అందాయి' అని సీవోఏ లేఖలో కోరిందని డీఎన్ఏ కథనాన్ని వెలువరించింది.
హసన్ జహాన్ చేసిన ఆరోపణలపై, పైన పేర్కొన్న అంశాలపై మాత్రమే దర్యాప్తు చేయాలని యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ ను సీవోఏ కోరింది.
దక్షిణాఫ్రికా జట్టు పర్యటన ముగిసిన తర్వాత షమీ పర్యటన వివరాలను వెల్లడించాలని కోల్కతా పోలీసులు బీసీసీఐకు లేఖ రాశారు.
షమీ ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ