BCCI Central Contracts: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషాన్‌లకు భారీ షాక్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు.. ఆ నలుగురికి A+ గ్రేడ్‌

BCCI Central Contracts For 2023-24: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అయింది. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ లిస్టులో వీరిద్దరికి చోటు దక్కలేదు.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 28, 2024, 07:22 PM IST
BCCI Central Contracts: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషాన్‌లకు భారీ షాక్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు.. ఆ నలుగురికి A+ గ్రేడ్‌

BCCI Central Contracts For 2023-24: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2023-24 సీజన్ కోసం టీమిండియా (సీనియర్ మెన్) కోసం ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు బీసీసీఐ షాకిచ్చింది. వీరిద్దరి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. వీరిద్దరి కాంట్రాక్ట్‌ను పునరుద్దించారు. A+ గ్రేడ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు చోటు దక్కించుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలకు గ్రేడ్ A కాంట్రాక్ట్ దక్కింది.

గ్రేడ్ Bలో సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్‌లకు గ్రేడ్ C కాంట్రాక్ట్ దక్కింది. సెలక్షన్ కమిటీ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లో ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైశాక్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వాత్ కావేరప్పలకు చోటు కల్పించింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ సిఫార్సు చేసింది. A+ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.7 కోట్లు, A గ్రేడ్‌కు రూ.5 కోట్లు, B గ్రేడ్ రూ.3 కోట్లు, C గ్రేడ్ ఆటగాళ్లకు రూ.కోటి పారితోషికం లభించనుంది. 

నిర్దేశిత వ్యవధిలో కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20 మ్యాచ్‌లు ఆడితే కొత్త ఆటగాళ్లు ఆటోమేటిక్‌గా ప్రో-రేట్ ఆధారంగా గ్రేడ్ Cలోకి యాడ్ అవుతారని తెలిపింది. ఈ రౌండ్ సిఫార్సులలో వార్షిక కాంట్రాక్టుల కోసం శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లను పరిగణించట్లేదని తెలిపింది. దేశవాళీ టోర్నీల్లో వీరిద్దరు పాల్గొనకపోవడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. కోచ్, సెలెక్టర్లు కోరితే.. కాంట్రాక్ట్ పొందిన ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News