TEAM INDIA FOR SOUTH AFRICA T20 SERIES : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఖరారు

TEAM INDIA FORM SOUTH AFRICA T20 SERIES : దక్షిణాఫ్రికాతో జూన్ 9నుంచి జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అదేవిధంగా ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 10:25 PM IST
  • దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఖరారు
    కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌.. దినేశ్ కార్తిక్, హార్ధిక్‌ రీఎంట్రీ
    ఇంగ్లండ్‌ పై టెస్ట్‌కూ జట్టును ఖరారు చేసిన కమిటీ
TEAM INDIA FOR SOUTH AFRICA T20 SERIES : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఖరారు

TEAM INDIA FORM SOUTH AFRICA T20 SERIES : దక్షిణాఫ్రికాతో జూన్ 9నుంచి జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అదేవిధంగా ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు రిషబ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్‌ 2022 సెన్సేషన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ మెయిడిన్‌ టీ20 ఆడనున్నాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య, వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజా సీజన్‌ ఐపీఎల్‌లో ప్రతిభ చాటిన ఎందరో ఆటగాళ్లు ఈ సారి జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.

ఈ సిరీస్‌తో పాటు బర్మింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జూలై 1 నుంచి జరిగే ఐదో టెస్ట్‌ కోసం రోహిత్‌ శర్మ తిరిగి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. ఇక కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటిన చతేశ్వర్ పుజారా టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టులో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు అనూహ్యంగా చోటు దక్కింది.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే...

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు భారత టెస్ట్‌ సభ్యులు వీళ్లే...

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

Also Read - Rishab Pant: ఇదేంది పంతూ... చేసిందంతా చేసి టీమ్ మేట్స్‌ను నిందిస్తావా... రిషబ్ పంత్‌పై నెటిజన్ల ట్రోలింగ్

Also Read - Pooja Hegde Cannes 2022 Pics: కేన్స్‌లో పూజా హెగ్దే సందడి.. ఎద అందాలు చూడతరమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News