Kohli Sachin Success Secret: చవకగా లభించే అరటి పండులో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. యాపిల్ పండు కన్నా అధికంగా ఉండే పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అథ్లెట్లు, క్రీడాకారులు, క్రికెటర్లు అరటిపండును విరివిగా తింటారు. తీరా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా అరటి పండ్లు బాగా తింటారు. ఎందుకో తెలుసా? అరటి పండులో విటమిన్ బీ6, విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. అంతేకాకుండా గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడిన్, నరింగిన్ వంటి యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అరటి పండు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. మానవ దేహానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతోంది.
క్రికెటర్లే కాదు షట్లర్లు, టెన్నీస్, కబడ్డీ తదితర ఆటగాళ్లు కూడా అరటి పండు తింటారు. అరటి పండు తింటే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. ఆట మధ్యలో క్రీడాకారులు ఆకలితో ఉంటే మధ్యలో అరటి పండ్లు తింటారు. వెంటనే వారికి శక్తి లభిస్తుంది. మరింత ఉత్సాహంతో ఆటలో రాణిస్తారు. వంద గ్రాముల సగటు అరటిపండులో 12 గ్రాముల ప్రోటీన్, 400 ఎంజీ కాల్షియం ఉంటుంది. ఫైబర్ 88 మి.గ్రాములు, పొటాషియం 7 మి.గ్రాములు, విటమిన్ సీ, 38 మి.గ్రాముల పాస్పరస్ ఉన్నాయి. విటమిన్ డీ, లవణాలు, ఇనుము, పొటాషియం శరీరాన్ని సులభంగా తీసుకుంటుంది. అరటి పండు తిన్న తర్వాత 15 నిమిషాల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయి దాదాపు 35 శాతం పెరిగి శరీరం, మనసును ఉత్తేజితం చేస్తుంది.
Also Read: India vs Bangladesh: రెండో టెస్టులో విరాట్ కోహ్లీ భారీ తప్పు.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్
అరటిపండులోని ప్రొటీన్, క్యాల్షియం శరీరంలోని నరాలను సేద తీరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె ఉచ్వాస నిశ్వాసాలను నియంత్రించడానికి అవసరమైన మెగ్నీషియం, బ్యాక్టీరియాను చంపే హైడ్రో యాసిడ్, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే సోడియం, ఉప్పు పొటాషియం అందిస్తుంది. రోజూ రెండు అరటిపండ్లు తింటే అధిక రక్తపోటును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో పొటాషియం స్థాయి తగ్గకపోతే మన శరీరం మరింత చురుకుగా పని చేస్తుంది. రోజూ 1 అరటి పండును అల్పాహారంతో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
సూచన: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఇచ్చినది. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారానికి జీ మీడియా ఎలాంటి బాధ్యత వహించదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.