Alyssa Healy: అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య! ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ టోర్నీ అవార్డులు అందుకున్న భార్యభర్తలు వీరే!

Alyssa Healy and Mitchell Starc. భార్యభర్తలు అయిన అలీసా హీలీ, మిచెల్ స్టార్క్ వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నారు. భార్యభర్తలు  ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 06:07 PM IST
  • విశ్వవిజేతగా ఆస్ట్రేలియా
  • అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య
  • ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ టోర్నీ అవార్డులు అందుకున్న భార్యభర్తలు
Alyssa Healy: అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య! ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ టోర్నీ అవార్డులు అందుకున్న భార్యభర్తలు వీరే!

Alyssa Healy, Mitchell Starc won Player Of The Series Awards in ODI World Cups: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఏడోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. క్రైస్ట్‌చర్చ్‌ స్టేడియంలో ఆదివారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 357 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లీష్ జట్టు 285 పరుగులకు ఆలౌటైంది. నటాలీ సీవర్ (148) చివర వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. సెంచరీ (129) అలీసా హీలీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఆసీస్ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అలీసా హీలీ వన్డే ప్రపంచకప్‌ 2022లో 9 మ్యాచ్‌ల్లో 56.56 సగటుతో 509 పరుగులు చేసింది. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్ సహా ప్రపంచకప్‌ మ్యాచులలో అదరగొట్టిన అలీసాకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డుతో పాటు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్' అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో ఓ రికార్డును ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో 'ప్లేయర్‌ ఆప్‌ ది మ్యాచ్‌' అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా అలీసా రికార్డుల్లోకి ఎక్కింది. 

అలీసా హీలీ భర్త, స్టార్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఆస్ట్రేలియా ప్రపంచకప్ సాధించడంలో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఏకంగా 27 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో ఆసీస్ ట్రోఫీ గెలవడంతో అలీసా కీలక పాత్ర పోషించింది. ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' టోర్నీ అవార్డులు అందుకున్న భార్యభర్తలు వీరే కావడం విశేషం. 

Also Read: Hyderabad Drugs Case: బంజారాహిల్స్ సీఐపై సస్పెన్షన్... ఏసీపీకి మెమో జారీ... నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు

Also Read: ICC Womens World Cup: విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఏడోసారి ప్రపంచకప్‌ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News