Asia Cup Final 2023: మరికాసేపట్లో ఫైన‌ల్ ఫైట్.. కప్పు గెలిచి ఇంటికి తీసుకురమ్ముంటున్న విక్టరీ వెంకటేష్..

IND vs SL: ఆసియా కప్ ఫైనల్ పోరుకు అంతా సిద్దమైంది. మరి కాసేపట్లో భారత్, శ్రీలంకలు తుదిపోరుకు రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు టాలీవుడ్ స్టార్ వెంకీమామా.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2023, 01:41 PM IST
Asia Cup Final 2023: మరికాసేపట్లో ఫైన‌ల్ ఫైట్..  కప్పు గెలిచి ఇంటికి తీసుకురమ్ముంటున్న విక్టరీ వెంకటేష్..

Asia Cup Final 2023: ఆసియా క‌ప్(Asia Cup 2023) ఫైన‌ల్ పోరు మరికాసేపట్లో మెుదలుకానుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, శ్రీలంకలు టైటిల్ ఫైట్ కు దిగబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగుతుంది. అయితే సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను తక్కువ అంచనా వేయద్దు. ఇప్పటి వరకు ఏడు సార్లు భారత్, ఆరు సార్లు శ్రీలంక ఆసియా కప్ ను గెలుచుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టు పెట్టాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. 

వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమో మనందరికీ తెలిసిందే. సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున వెంకీ ఆడాడు. అంతేకాకుండా జట్టు కెప్టెన్, మోంటార్ గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే వెంకీమామా కచ్చితంగా చూడటానికి వెళ్తాడు. తాజాగా ఆసియా కప్ ఫైనల్లో కప్ గెలిచి ఇంటికి కప్పు తీసుకురండి కెప్టెన్ అంటూ వెంకీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్/తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలగే, సహన్ అరాచ్చిగే, ప్రమోద్ మధుషన్, మతీషా పతిరణ

Also Read:IND vs BAN Dream11 Prediction: ఆసియా కప్‌లో ఫైనల్ ఫైట్ నేడే.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News