Asia Cup-2022: ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్..భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అప్పుడే..!

Asia Cup-2022: మరో క్రికెట్ ఫీవర్ రాబోతోంది. టీ20 ప్రపంచకప్‌ ముందే ఆసియా కప్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 7, 2022, 05:04 PM IST
  • త్వరలో ఆసియా కప్‌
  • టోర్నీ తేదీలు ఖరారు
  • భారత్,పాక్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ
Asia Cup-2022: ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్..భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అప్పుడే..!

Asia Cup-2022: త్వరలో ఆసియా కప్‌ అలరించబోతోంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో టోర్నీని చేపట్టాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) నిర్ణయించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ట్రోఫీ జరగనుంది. ఈమేరకు ఆసియా కప్‌ తేదీలను ఖరారు చేశారు. శ్రీలంక వేదికగా ఆసియాకప్‌ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో ప్రకటించనున్నారు. శనివారం జరగబోయే వార్షిక సమావేశంలో షెడ్యూల్‌ను ఫిక్స్ చేయనున్నారు. 

ఆసియా కప్‌లో ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. టీమిండియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్థాన్‌, యూఏఈ, సింగపూర్, కువైట్, హాంగ్‌కాంగ్‌ జట్లు తలపడనున్నాయి. ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ఉండే అవకాశం ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ చేతిలో భారత్‌ ఓటమి పాలైంది. దీనికి ఆసియా కప్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. 

సెప్టెంబర్‌లో ఆసియా కప్ ముగియగానే..టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది. అక్టోబర్‌లో మెగా టోర్నీ జరగనుంది. ప్రస్తుతం టీమిండియా ..ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ మొదలు కానుంది. ఆ తర్వాత విండీస్‌తో టీమిండియా తలపడుతుంది. టీ20 ప్రపంచకప్‌ టార్గెట్‌గా ఆటగాళ్లను బీసీసీఐ ప్రయోగిస్తోంది. ప్రతి సిరీస్‌కు కెప్టెన్‌లను, ఆటగాళ్లను మార్చుతున్నారు.

Also read:Kaali poster row: ఇంత వివాదం జరుగుతుంటే మరో వివాదాస్పద ఫోటో షేర్ చేసిన లీనా మణిమేఖలై

Also read:Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News