Nathan Lyon ends long wait for 400 Test wickets,: క్రికెట్ ఆటలో ఒక్కోసారి అదృష్టం వరిస్తే.. మరోసారి దురదృష్టం వెంటాడుతుంది. ఓ బ్యాటర్ సెంచరీ కోసం సంవత్సరాలుగా ఎదురుచూడాల్సి రాగా.. ఓ బౌలర్ కూడా ఒక్క వికెట్ కోసం ఏన్నో రోజులు వేచిచూడాల్సి వస్తుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం రెండు సంవత్సరాలుగా వేచిచూస్తుండుగా.. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) ఓ టెస్ట్ వికెట్ తీయడానికి ఏకంగా 326 రోజులుగా ఎదురుచూశాడు. చివరకు ఆ వికెట్ దక్కించ్చుకోవడమే కాకుండా అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. యాషెస్ (Ashes 2021) టెస్టు సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన లైయన్ 400 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు.
గబ్బా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడం ద్వారా నాథన్ లియాన్ (Nathan Lyon) టెస్టుల్లో 400 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్లో 400 (400 Test wickets)లకు పైగా వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు షేన్ వార్న్ (708 వికెట్లు), గ్లెన్ మెక్ గ్రాత్ (563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక టెస్టుల్లో 400 వికెట్లు తీసిన జాబితాలో లియన్ 17వ బౌలర్ కావడం విశేషం. ఆస్ట్రేలియా తరపున లైయన్ 101వ టెస్టు ఆడాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ల జాబితాలో లియాన్ (402) నాలుగో స్థానంలో ఉన్నాడు. హర్బజన్ సింగ్ (417), రవిచంద్రన్ అశ్విన్ (427), ముత్తయ్య మురళీధరన్ (800) ముందున్నారు.
Also Read: Omicron: ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు.. భయాందోళనలో ప్రజలు! దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ (Nathan Lyon) టెస్టుల్లో 400 వికె (400 Test wickets)ట్ల మైలురాయిని చేరుకోవడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ని ఔట్ చేయడం ద్వారా లైయన్ 399 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడికి మరో వికెట్ తీసేందుకు 326 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో ఇంగ్లీష్ ఆటగాడు డేవిడ్ మలన్‌ని ఔట్ చేయడం ద్వారా లైయన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయింది. లైయన్ ఆసీస్ తరఫున 101 టెస్టులు, 29 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టుల్లో ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు తీశాడు. ఆ తర్వాత షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (632), స్టువర్ట్ బ్రాడ్ (524) ఉన్నారు.
Also Read: ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఎలా చెప్పగలను.. బాంబ్ పేల్చిన ప్రముఖ లేడీ కమెడియన్! షాక్ తిన్న భర్త!!
యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా (ENG vs AUS) 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజైన శనివారం 297 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో కేవలం 20 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 5.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆసీస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెంచరీ కొట్టిన ట్రావిస్ హెడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేయగా.. ఆసీస్ 425 రన్స్ చేసింది.
Nathan Lyon joined elite company today as the 17th man to reach 4️00 Test wickets!
Don't miss a ball of the Ashes series on https://t.co/CPDKNx77KV (in selected regions).#AUSvENG #WTC23 pic.twitter.com/atCupMknks
— ICC (@ICC) December 11, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook