Andre Russell Nude Photo: న్యూడ్ ఫొటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్.. అవాక్కవుతున్న ఫాన్స్! అచ్చు రణ్‌వీర్ సింగ్ మాదిరే

Cricketer Andre Russell shares Nude Selfie pic goes viral. వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ సోషల్ మీడియా వేదికగా తన న్యూడ్ ఫొటోను షేర్ చేశాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 18, 2022, 08:36 PM IST
  • న్యూడ్ ఫొటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్
  • అవాక్కవుతున్న ఫాన్స్
  • అచ్చు రణ్‌వీర్ సింగ్ మాదిరే
Andre Russell Nude Photo: న్యూడ్ ఫొటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్.. అవాక్కవుతున్న ఫాన్స్! అచ్చు రణ్‌వీర్ సింగ్ మాదిరే

West Indies cricketer Andre Russell shares Nude Selfie: వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా తన న్యూడ్ ఫొటోను షేర్ చేయడమే ఇందుకు కారణం. ఓ షాపింగ్ మాల్‌లో న్యూడ్‌గా తీసుకున్న సెల్ఫీని ఆండ్రీ రస్సెల్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. అద్దం ముందు నిల్చొని ఆ ఫొటో తీసుకున్నాడు. రస్సెల్ తన పురుషాంగం కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ఈ ఫొటో చూసిన క్రికెట్ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 

ప్రస్తుతం ఆండ్రీ రస్సెల్ న్యూడ్ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ ఫాన్స్ ఈ న్యూడ్ ఫొటోపై కామెంట్స్‌, సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఆండ్రీ రస్సెల్.. ఇదేం పోయే కాలంరా నీకు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది నీకు అవసరమా ఆండ్రీ రస్సెల్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరికొందరు నెటిజను బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్‌తో రస్సెల్ న్యూడ్ ఫొటోను పోల్చుతున్నారు. రణ్‌వీర్ సింగ్ విప్పితే గ్లామర్.. నువ్ విప్పితే వల్గర్ అని సెటైర్లు పేల్చుతున్నారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాంచైజీ ఆండ్రీ రస్సెల్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రస్సెల్.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. రస్సెల్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను నిశితంగా చూస్తే.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫిట్‌గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడని ఇట్టే అర్ధమవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022కు రస్సెల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

టీ20 ప్రపంచకప్ 2022కు ఆండ్రీ రస్సెల్ మాత్రమే కాదు సునీల్ నరైన్, షిమ్రాన్ హెట్మెయర్ కూడా ఆడకపోవడంతో వెస్టిండీస్ క్వాలిఫయర్స్‌ రౌండ్ నుంచే ఇంటిదారి పట్టింది. పొట్టి ప్రపంచకప్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కరీబియన్ జట్టు క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రస్సెల్ విండీస్ తరఫున 1 టెస్ట్, 56 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. ఇక 98 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 

Also Read: Female Snake Catcher King Kobra: స్నేక్ క్యాచర్‌లకు చుక్కలు చూపించిన బ్లాక్ కింగ్ కోబ్రా.. అమ్మాయి ఈజీగా పట్టేసింది!

Also Read: King Kobras Fight Viral Video: ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం.. ఐదు గంటల పాటు కొట్టుకున్న రెండు మేల్ కింగ్ కోబ్రాలు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News