Ambati Rayudu’s Six breaks fridge glass: అంబటి రాయుడు మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో 27 బంతుల్లో 72 పరుగులు ( 4 ఫోర్లు, 7 సిక్సులు) చేసి నాటౌట్‌గా నిలిచి తనలో పర్ఫార్మెన్స్కి ఇంకా కొదువ లేదనిపించుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కి వచ్చిన అంబటి రాయుడు.. స్టేడియం నలువైపులా ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించాడు. అయితే, అన్ని సిక్సుల్లో ఒక సిక్స్ మాత్రం భారీ హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ డగౌట్ని షేక్ చేసింది.
ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) వేసిన బంతిని అంబటి రాయుడు సిక్స్ కొట్టగా అది నేరుగా వెళ్లి ముంబై ఇండియన్స్ డగౌట్ ఆవరణలోని ఫ్రిడ్జ్‌ని బలంగా తాకింది. ఆ ఫోర్స్‌కి ఫ్రిడ్జ్ అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. అంబటి రాయుడు కొట్టిన సిక్స్ తగిలి ఫ్రిడ్జ్ అద్దం ద్వంసం కావడంతో అంబటి రాయుడు సిక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This was the moment #MIvsCSK #IPL2021 #mi #csk #rayudu pic.twitter.com/vef1ngmURv
— Gaurav Gambhir (@GauravGambhir16) May 1, 2021
Also read : IPL 2021: SRH కెప్టేన్ డేవిడ్ వార్నర్ కాదు.. Kane Williamson
అంబటి రాయుడు 12వ ఓవర్లో బ్యాటింగ్‌కి వచ్చీ రావడంతోనే తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టాడు. పేసర్లనే కాదు.. స్నిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లోనూ అంబటి రాయుడు విరుచుకుపడటం ఆపలేదు. అంతకంటే ముందు బ్యాటింగ్ చేసిన డు ప్లెసిస్ (Du Plessis) 50 పరుగులు (28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్లర్లు), మోయీన్ అలీ (Moeen Ali) 58 పరుగులు (36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేయగా వారి తర్వాత స్కోర్ బోర్డుని పరుగులెత్తించే బాధ్యతను అంబటి రాయుడు (Ambati Rayudu) తీసుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా (22)తో కలిసి స్కోర్‌ని ముందుకు పరుగులెత్తించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) 218 పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్‌కి (Mumbai Indians) భారీ లక్ష్యాన్ని విధించింది.
Also read: PBKS vs RCB in IPL 2021: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు (Jasprit Bumrah) కెరీర్లోనే ఇదో పెద్ద ఫెయిల్యూర్ మ్యాచ్. 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. మొయీన్ అలీ ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook