Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్.. వరల్డ్‌కప్‌ తరువాత గుడ్‌బై..!

AB De Villiers On Virat Kohli Retirement: ఈ వరల్డ్ కప్ తరువాత విరాట్ కోహ్లీ వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని ఏబీ డివిలియర్స్ అన్నాడు. టెస్టులు, ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం ఉందన్నాడు. 2027 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడని ఇప్పుడే చెప్పడం కష్టమన్నాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 26, 2023, 08:25 PM IST
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్.. వరల్డ్‌కప్‌ తరువాత గుడ్‌బై..!

AB De Villiers On Virat Kohli Retirement: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్. వరల్డ్ కప్ తరువాత కోహ్లీ వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికే అవకాశం ఉందన్నాడు. 2027 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉందని.. కోహ్లీ ప్రస్తుతం ఈ వరల్డ్ కప్‌పైనే దృష్టిపెట్టాడని చెప్పుకొచయ్చారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే విరాట్ కోహ్లీకి ఇంతకంటే గొప్పదనం ఏముంటుందని.. అది కోహ్లీకి గొప్ప కానుకగా నిలుస్తుందన్నాడు.

"విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా (2027 ప్రపంచ కప్ కోసం) ప్రయాణించడం ఇష్టపడతాడని నాకు తెలుసు. కానీ చెప్పడం చాలా కష్టం. దీనికి చాలా సమయం ఉంది. ముందు ప్రస్తుత వరల్డ్ కప్‌పై మీద దృష్టి పెడదాం, విరాట్ కోహ్లీ మీకు చెప్పేది ఇదే అని నేను అనుకుంటున్నాను. భారత్ ఈ ప్రపంచకప్‌ను గెలిస్తే కోహ్లీకి పెద్ద గిఫ్ట్.. కోహ్లీ రాబోయే కొన్నేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నాడు.  ఐపీఎల్‌లో కూడా పాల్గొనబోతున్నాడు.." అని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో కలిసి ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. ఇద్దరు మైదానం బయట కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కోహ్లీకి ఎంతో ఇష్టమైన డివిలియర్స్.. ఇలాంటి కామెంట్స్ చేయడంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కోహ్లీ నిజంగా వన్డే, టీ20లకు గుడ్‌బై చెబుతాడా..? అని ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీతో ప్రపంచకప్‌కు ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరాడు. ఫిట్‌నెస్ పరంగా అత్యుత్తమంగా ఉన్న కోహ్లీ 2027 ప్రపంచకప్‌ కూడా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

డివిలియర్స్ 34 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2021 వరకు 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 184 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 111 టెస్టులు, 280 వన్డేలు, 115 టీ20, 237 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 

Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్

Also Read: Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G మొబైల్‌పై స్పెషల్‌ డీల్‌..రూ. 9,900కే పొందండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News