1 Ball 16 Runs: ఒక బంతికే 16 రన్స్.. గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం కాదు! ఎలా సాధ్యమైదంటే

Joel Paris Concedes 16 Runs in One Ball at BBL 2023. బిగ్‌ బాష్‌ లీగ్‌ 2022-23లో భాగంగా ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోయెల్ పారిస్‌ ఒక బంతికే 16 రన్స్ సమర్పించుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 23, 2023, 09:40 PM IST
  • ఒక బంతికే 16 రన్స్
  • గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం కాదు
  • ఎలా సాధ్యమైదంటే
1 Ball 16 Runs: ఒక బంతికే 16 రన్స్.. గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం కాదు! ఎలా సాధ్యమైదంటే

Joel Paris Concedes 16 Runs in One Ball at BBL 2023: సాధారణంగా క్రికెట్‌లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు వస్తుంటాయి. బ్యాటర్ సిక్సుల వర్షం కురిపిస్తే.. 36 రన్స్ కూడా వస్తాయి. ఒకే ఓవర్లో 20కి పైగా పరుగులు రావడం నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ బంతికి 10 రన్స్ కంటే ఎక్కువ రావడం చాలా అరుదు. తాజాగా ఓ లీగల్ డెలివరీకి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సోమవారం బిగ్‌ బాష్‌ లీగ్‌ 2022-23లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌, హోబర్ట్ హరికేన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సిడ్నీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ని ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోయెల్ పారిస్‌ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి రెండు బంతులను ఎదుర్కొన్న స్టీవ్‌ స్మిత్.. ఒక్క పరుగు కూడా చేయలేదు. మూడో బంతికి స్మిత్‌ సిక్సర్ బాధగా.. ఆ బంతిని అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. దాంతో 7 పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి కూడా 5 పరుగులు (వైడ్‌+ఫోర్‌) రావడంతో 12 పరుగులు జతయ్యాయి. తర్వాత వేసిన ఫ్రీ హిట్‌ని స్మిత్‌ బౌండరీకి పంపాడు. దీంతో  జోయెల్ ఒక బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోయెల్ పారిస్‌ వేసిన బౌలింగ్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోని KFC Big Bash League తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఒక లీగల్ డెలివరీకి 16 పరుగులు వచ్చాయి' అని పేర్కొంది. పాపం జోయెల్ పారిస్‌ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆలస్యం ఎందుకు మీరు వీడియో చూసేసయండి. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (66; 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంటిరీ బాదాడు. అనంతరం హోబర్ట్‌ హరికేన్స్‌ 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులే చేసి.. 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. జాక్‌ క్రాలే (49) టాప్‌ స్కోరర్‌. స్మిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

Also Read: Athiya Shetty KL Rahul Wedding Pics: వివాహ బంధంతో ఒక్కటైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. పెళ్లి ఫొటోస్ వైరల్!  

Also Read: Yamaha RX100 Launch: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. యమహా ఆర్ఎక్స్ 100 మళ్లీ లాంచ్ అవుతోంది! 150cc ఇంజిన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News