టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ..ఐసీసీ వన్డే ర్యాకింగ్ లోనూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో విజయంతో టీమిండియా 120 పాయింట్లు సాధించింది. దీంతో సౌతాఫ్రికా (119)ను వెనక్కినెట్టేసినట్లయింది. కాగా ఆసీస్ 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాల్గు, ఐదు స్థానాల్లో ఇంగ్లండ్ (113), కీవీస్ (111)లు కొనసాగుతున్నాయి.
మిలిగిన మ్యాచ్చుల్లో గెలిస్తేనే ర్యాంక్ పదిలం..!
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నప్పటికీ..అది పదిలం కాదు. చివరి రెండు వన్డేల్లో ఓడితే రెండో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. నంబర్ వన్ ర్యాంక్ కోసం ఆసీస్ ఐదు వన్డేల సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు నెగ్గాల్సిన భారత్ ..ఇప్పటికే మూడు విజయాలు సాధించింది. చివరి రెండు వన్డేల్లో ఒకటి నెగ్గినా భారత్ అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంటుంది. కోహ్లీసేన గత ఏడాది నుంచి టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డేల్లోనూ నిలకడ ప్రదర్శన ఇస్తున్న కోహ్లీసేన..ఇప్పటికి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
వన్డేలోనూ టీమిండియా నంబర్ వన్