Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

why Do we eat Fish on Mrigasira Karthi: సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం నామకరణం చేశారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 8, 2021, 12:10 PM IST
Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

Why Do we eat Fish on Mrigasira Karthi: జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం నామకరణం చేశారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేశారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచేవారు. 

సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. తెలుగు ప్రజలు చంద్ర మానాన్ని పాటిస్తారు. సూర్యుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండే రోజులను మృగశిర కార్తె అని పిలుచుకుంటారు. ఇది 5వ నక్షత్రం, కనుక కార్తెను మృగశిర కార్తె అని వ్యవహరిస్తారు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు, రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అని రైతులు సామెతలు చెప్పుకుంటారు. ఇందుకు సైతం కారణాలున్నాయి. 

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

నేడు (జూన్ 8న) మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర కార్తె రాగానే వేసవికాలం ఎండల నుంచి ఉపశమం కలుగుతుంది. వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికిగానూ మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు.  దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం సమస్యతో బాధపడేవారికి ఈ కార్తె ప్రారంభమైన రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో బత్తిన సోదరులు చేప ప్రసాదం ఇవ్వడం తెలిసిందే. మరోవైపు ఈ కార్తెకు రెండు మూడు రోజుల ముందు నుంచే చేపల మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. 

Also Read: Hanuman Jayanthi 2021 Date: తిరుమలలో నేటి నుంచి 5 రోజులపాటు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

చేపలు ఎందుకు తినాలి
మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండటంతో తగినంత వేడికోసం చేపలను ఆరగిస్తారు. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభం అవుతాయి. ఆ సమయంలో సీజనల్ వ్యాధులు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. అదే సమయంలో శాఖాహారులైతే బెల్లంలో ఇంగువను కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకుని తినేవారని పెద్దలు చెబుతుండేవారు. నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News