Weekly Horoscope: రేపటి నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

Weekly Rashifal: రేపటి నుండి జూన్ రెండో వారం మెుదలుకానుంది. ఈ వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2023, 05:48 PM IST
Weekly Horoscope: రేపటి నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

Weekly Horoscope 5 to 11 June 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చుకుంటాయి. జూన్ రెండో వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం జరగబోతుంది.  గ్రహాల యువరాజు బుధుడు వృషభరాశిలోకి వెళ్లనున్నాడు. గ్రహాల కదలికలు వల్ల జూన్ రెండో వారం ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.  

మిథునరాశి
జూన్ రెండో వారం మిథునరాశి వారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురిపిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. 
సింహరాశి
జూన్ సెకండ్ వీక్ సింహ రాశికి అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి జూన్ రెండో వారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీరు జాబ్ మారడానికి ఇదే మంచి సమయం. మీరు ఈ సమయంలో భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. 

Also Read: Shani Vakri 2023: శష్ రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫ్యూచర్.. మీది ఉందా?

కన్యా రాశి
కన్యా రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. మీ పిల్లలు జీవితంలో ఎదుగుతారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
తుల రాశి
ఈ నెల రెండో వారంలో తులారాశి వారు తమ లక్ష్యంపై దృష్టి సారిస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు సంతోషంగా ఉంటారు. ఆఫీసులో సహచరుల సపోర్టు లభిస్తుంది.

Also Read: Kendra Trikon Rajyog: జూన్ 17న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News