Guru Gochar 2023: పుష్కర కాలం తర్వాత కీలక రాజయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

Vipreet Rajyog effect: ఏ వ్యక్తి జాతకంలో వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుందో వారి దేనికీ లోటు ఉండదు. కుండలిలో ఆరవ, అష్టమ, పన్నెండవ గృహాల అధిపతులు కలయిక ఏర్పడినప్పుడు ఈ యోగం రూపొందుతుంది. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 5, 2023, 10:51 AM IST
Guru Gochar 2023: పుష్కర కాలం తర్వాత కీలక రాజయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

Guru Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. గురుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గత నెల 22న బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించాడు. ఇది అరుదైన సంఘటన 12 ఏళ్ల తర్వాత ఏర్పడింది. మేషరాశిలో జ్యూపిటర్ గోచారం వల్ల వ్యతిరేక రాజయోగం లేదా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వ్యతిరేక రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం. 

కన్య రాశి
విపరీత రాజయోగం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ మరియు వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
తులా రాశి
వ్యతిరేక రాజయోగం తుల రాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. మీరు వ్యాపారంలో చాలా డబ్బును గడిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.  మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Chandra Grahan 2023: 130 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం.. వీరి ఆదాయం డబల్ అవ్వడం పక్కా..

మిధునరాశి
మేషరాశిలో వ్యతిరేక రాజయోగం ఏర్పడటం వల్ల మిథునరాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందుతారు. 
కర్కాటక రాశి
విపరీత రాజయోగం వల్ల కర్కాటక రాశి వారు అపారమైన ధనాన్ని పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు కెరీర్ లో మంచి విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. 

Also Read: Astrology: శని షడష్టక యోగంతో ఈ రాశుల జీవితం నరకం.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News