Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఇవాళ అంటే ఏప్రిల్ 06న శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సంచారం కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు ప్రయోజనం
సింహరాశి
శుక్రుడి రాశి మార్పు సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. శుక్రుడి సంచారం కారణంగా మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే సూపర్ గా ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది.
వృశ్చిక రాశి
శుక్రుడి గోచారం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. తోబుట్టువుల సపోర్టు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కే అవకాశం ఉంది.
వృషభం
వృషభ రాశి వారికి మాళవ్య రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. లైఫ్ పార్టనర్ యెుక్క పూర్తి సహకారం మీకు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఇతర వ్యక్తులుతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది.
Also Read: Surya Grahan Effects: సూర్యగ్రహణానికి, భారత్ లో కరోనా కేసులు పెరగడానికి ఏం సంబంధం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి