Shukra Mangal Yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల సంచారం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొన్ని రాశులకు అశుభకరంగానూ ఉంటుంది. రీసెంట్ గా అంటే మే 30న శుక్రుడు వృషభరాశిలో సంచరించాడు. అంతేకాకుండా అంగారక గ్రహంతో శుక్రుడు సంయోగం జరిగింది. శుక్రుడు మరియు కుజుడు కలయిక రాబోయే 27 రోజులపాటు నాలుగు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
శుక్రుడు మరియు కుజుడు సంయోగం కర్కాటక రాశి వారికి మంచి రోజులు తీసుకురాబోతున్నాయి. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభించే అవకాశం ఉంది.
మకరరాశి
రాబోయే 27 రోజులు మకరరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది.
Also Read: Shash Rajyog: జాతకంలో ఈ రాజయోగం ఉన్నవారు కింగ్ లా బతుకుతారు..!
మేషరాశి
వృషభరాశిలో శుక్రుడు మరియు అంగారకుడు కలయిక మేషరాశి వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడి ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులు పరీక్షలు మరియు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. అంతేకాకుండా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
కన్య రాశి
మార్స్ మరియు వీనస్ మీట్ వల్ల కన్యా రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ప్రతి రంగంలో రాణిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా మీకు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Astrology: నవపంచం రాజయోగంతో ఈ 4 రాశులకు మహార్దశ.. వీరు పట్టిందల్లా బంగారమే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook