Goddess Annapurna: ఇంట్లో అన్నపూర్ణ దేవీ చిత్రపటాన్ని ఈ దిశలో ఉంచితే.. ధాన్యానికి, సంపదకు ఏ లోటు ఉండదు..

Goddess Annapurna Devi Photo in Home: ధాన్యానికి, సంపదకు ప్రతీక అయిన అన్నపూర్ణ దేవీ అనుగ్రహం లభిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఇక ఏ లోటు ఉండదు. అన్నపూర్ణ దేవీ అనుగ్రహం ఎలా కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2022, 10:25 AM IST
  • ఇంటి కోసం వాస్తు టిప్స్
  • ఇంట్లో అన్నపూర్ణ దేవీ చిత్రపటం శుభసూచకం
  • అయితే అది సరైన దిశలో ఉండాలి
Goddess Annapurna: ఇంట్లో అన్నపూర్ణ దేవీ చిత్రపటాన్ని ఈ దిశలో ఉంచితే.. ధాన్యానికి, సంపదకు ఏ లోటు ఉండదు..

Goddess Annapurna Devi Photo in Home: అన్నపూర్ణ దేవీ కొలువైన ఇంట్లో తిండికి, సంపదకు లోటు ఉండదు. అన్నపూర్ణ అనుగ్రహం లభిస్తే అష్ట  ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఇంట్లో అన్నపూర్ణ దేవీ చిత్రపటం సరైన దిశలో ఉంటేనే ఆ దేవి  అనుగ్రహం పొందగలరు. దీనికి సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు సూచించబడ్డాయి. వాస్తు ప్రకారం అన్నపూర్ణ దేవీ చిత్రపటం ఇంట్లో ఏ దిశలో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

అన్నపూర్ణ చిత్రపటాన్ని ఏ దిశలో ఉంచాలి

వాస్తు శాస్త్రం ప్రకారం అన్నపూర్ణ దేవీ చిత్రపటాన్ని ఇంట్లో తూర్పు-దక్షిణ దిక్కుల మధ్యలో ఉంచాలి. తద్వారా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కష్టనష్టాలన్నీ తొలగి అదృష్టం సిద్ధిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు-దక్షిణ దిక్కును పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ దిశలో అన్నపూర్ణ దేవీ చిత్రపటాన్ని ఉంచడం ద్వారా ఆ దేవత అనుగ్రహం పొందవచ్చు.

వంట గదిలో అన్నపూర్ణ దేవీ చిత్రపటం

అన్నపూర్ణ దేవీ చిత్రపటాన్ని వంటగదిలో ఉంచితే ఆ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదని నమ్ముతారు. వంట గదిలో ఈశాన్య దిశలో అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలి. ప్రతీ శుక్రవారం అమ్మవారిని పూజించాలి. ఆ సమయంలో వంట పొయ్యికి ఇరుపక్కలా దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఆ దేవత అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తాయి. తద్వారా జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దానిని నిర్ధారించలేదు.)

Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్  

Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News