Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూమ్ ఇలా లేకపోతే ఇక అంతే సంగతులు..

Vastu Tips:మనం చాలా విషయాలను తేలికగా తీసుకుంటాం కానీ కొన్ని విషయాల్లో మాత్రం గట్టి నమ్మకాలు పెట్టుకుంటాం. అలాంటి ఒక విశ్వాసమే వాస్తు. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా వాస్తు ని కచ్చితంగా నమ్ముతారు. మరి వాస్తు ప్రకారం బాత్రూం లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు? ఉన్న వాటిని ఎలా పెట్టుకోవాలి? తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 10:36 PM IST
Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూమ్ ఇలా లేకపోతే ఇక అంతే సంగతులు..

Vastu for Bathroom:

మనం నిత్యం నివసించే ఇంట్లో వాస్తు పరంగా ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి అని అనుకుంటాము. అలాగే మన బాత్ రూమ్ లో కూడా వాస్తు పాటించాలి అంటున్నారు వాస్తు నిపుణులు. బాత్రూంలో వాస్తు ప్రకారం మనం చేసే మార్పుల కారణంగా మనకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి వాస్తు పరంగా మన బాత్రూంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.. 

బాత్రూమ్ డైరెక్షన్:

వాస్తు శాస్త్రం ప్రకారం గదిలో ఉన్న అటాచ్డ్ బాత్రూం ప్రభావం భార్యాభర్తల సంబంధం పై నేరుగా పడుతుంది. అందుకే భార్యాభర్తలు ఎప్పుడూ బాత్రూం వైపు కాట్ పెట్టి నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల మీ సంసారంలో గొడవలు ఏర్పడతాయి.

బాత్రూమ్ కలర్:

మీరు ఎప్పుడూ బాత్రూం గోడలకు లైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. లేత గోధుమ లేక తెలుపు రంగులు బాత్రూం కి బాగా సెట్ అవుతాయి. బాత్రూం కలర్ లైట్ గా ఉండడం వల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది.

బాత్రూమ్ లో ఇది వద్దు:

నిద్రపోవడానికి ముందు కచ్చితంగా బాత్ రూమ్ తలుపులను మూసి ఉంచాలి. మీరు బాత్రూంలో వాడే బక్కెట్టు, మగ్ నీలిరంగులో ఉండే విధంగా చూసుకోండి. ఇలా ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు ఎరుపు రంగులో ఉన్న బకెట్లను లేక టబ్ లను బాత్రూంలో వాడకండి.

రాక్ సాల్ట్:

బాత్రూంలో కబోర్డ్ కార్నర్లు ఒక గ్లాస్ బౌల్లో కాస్త కళ్ళు ఉప్పు వేసి ఉంచడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ తగ్గుతాయి. ప్రతివారం ఈ గాజు గిన్నెను శుభ్రం చేసి కొత్త ఉప్పు మారుస్తూ ఉండాలి.

టాయిలెట్ సీటు:

మనం చాలా వరకు టాయిలెట్ సీట్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంచుతాం కానీ వాస్తు ప్రకారం అలా చేయకూడదట. పొరపాటున మనం సీట్లు తెరిచి ఉంచితే ఇంటిలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది అంటున్నారు వాస్తు పండితులు. పైగా ఇలా చేసేవారికి ఆర్థికపరమైన నష్టాలు కూడా ఎక్కువగా ఎదురయ్య ఛాన్స్ ఉంది. కాబట్టి మీ రూం లోని టాయిలెట్ సీట్లు ఎప్పుడు మూసే ఉంచండి.

ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివిటీ నెలకొని ఉంటుంది. బాత్రూమ్ ని ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవడంతో పాటు టాప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి. అలాగే బాత్రూంలో తడిచిన బట్టల్ని ఉంచడం వల్ల బ్యాక్టీరియా సులభంగా స్ప్రెడ్ అవుతుంది .కాబట్టి ఈ అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోండి.

గమనిక :పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News