Paush Putrada Ekadashi 2023: హిందూ శాస్త్రాల ప్రకారం, ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. సూర్యుడు దక్షిణయాణం నుంచి ఉత్తరయాణంలోకి ప్రయాణం చేసే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా పుష్య పుత్రదా ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ సారి వైకుంఠ ఏకాదశి 2023 జనవరి 2న జరుపుకోనున్నారు. ఈరోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధిస్తే వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. అంతేకాకుండా ఇదే రోజు మూడు అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. పవిత్రమైన సమయం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
పుత్రదా ఏకాదశి తిథి, శుభ ముహూర్తం
వేద పంచాంగం ప్రకారం, జనవరి 1వ తేదీ సాయంత్రం 7:10 గంటలకు పుష్య ఏకాదశి తిథి ప్రారంభమై...జనవరి 2వ తేదీ రాత్రి 8.24 గంటలకు ముగుస్తుంది. అందుకే పుత్రదా ఏకాదశి 2ని ఉదయతిథి ప్రకారం జరుపుకోనున్నారు. మరోవైపు జనవరి 3వ తేదీ ఉదయం కూడా పుత్రదా ఏకాదశిని జరుపుకుంటారు.
అరుదైన శుభయోగం
పంచాంగం ప్రకారం, ఈ రోజున భరణి మరియు కృత్తిక నక్షత్రాల ఉనికి చర మరియు సుస్థిర అనే శుభ యోగాన్ని సృష్టిస్తుంది. ఇవి కాకుండా ఈ రోజున సాధ్య అనే మరో శుభ యోగం కూడా ఉంటుంది. ఈ యోగాలలో పూజ చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు లభిస్తాయి.
పుత్రదా ఏకాదశి పూజా విధానం
ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి దీపం వెలగించి పూజలు చేయండి. పసుపు కలర్ పువ్వులు, స్వీట్లను దేవుడికి సమర్పించండి. అభిషేకం చేసి..చివరిలో హారతి ఇచ్చి భక్తులకు ప్రసాదం పంచండి. దీని వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఏకాదశి యెుక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పాడు. ఈ ఏకాదశిని నీరు కూడా ముట్టుకోకుండా చేయాలి.
Also Read: Shukra Gochar 2022: డిసెంబరు 29న శుక్రుడి చివరి సంచారం... కొత్త ఏడాదిలో వీరికి కష్టాలే కష్టాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook