2023 Ugadi Date: ఉగాది పండుగ హిందువుల మొదటి పండగ. భారతీయులంతా ఉగాది పండగతోనే పండగలను ప్రారంభిస్తారు. ఈ పండగను ఎక్కువగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మార్చి 22వ తేదిన వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇదే రోజున కొత్త పంచాగాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ పండగకు ఇంత ప్రాముఖ్య ఉండడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ పండగను మరాఠీ, కొంకణి హిందువులు గుడి పడ్వాగా పిలుస్తారు. ఉగాది అనే పదంలో రెండు పదాలు ఉంటాయి. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభమని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉగాది అంటే "కొత్త శకం ప్రారంభం" అని అర్థం. ఉగాది పండగకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. ఉగాది చరిత్ర:
హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున విశ్వాన్ని సృష్టించాడు. దుర్గామాత తొమ్మది రూపాలను ఎత్తుతుంది. అయితే ఈ తొమ్మిది రోజులు విశ్వమంతా పండగలు జరుపుకుంటారు. వీటినే చైత్ర నవరాత్రులు అని అంటారు. అయితే ఇవి ఉగాది పండగ రోజే ప్రారంభంమవుతాయి. అంతేకాకుండా బ్రహ్మ దేవుడు మానవాళిని సృష్టించినందుకు గుర్తుగా ఈ రోజును ఉగాదిగా జరుపుకుంటారు. 12వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య ఉగాదిని కొత్త సంవత్సరంగా ప్రారంభించారు.
2. ఉగాది ప్రాముఖ్యత:
ఉగాది అంటే ఒక సంవత్సరం ప్రారంభం. యుగం అంటే కాలం, ఆది అంటే ఏదో ప్రారంభం. ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ దేవుడు చేసిన ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇది వసంతకాలం ప్రారంభం, శీతాకాలపు కఠినమైన చలి తర్వాత తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగ. ఇది వసంత రుతువును స్వాగతించడానికి జరుపుకునే పండుగ కూడా..
3. ఉగాదిని ఎలా జరుపుకోవాలి..?
ఉగాది పండుగకు వారం రోజుల ముందు నుంచే పలు రాష్ట్రాల వారు జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారతీయులంతా ఇళ్లను శుభ్రం చేసి కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా గుమ్మానికి మామిడి ఆకులతో అలంకరిస్తారు. పండుగ రోజున ప్రజలు తమ ఇళ్ల చుట్టూ కల్లాపి కూడా చల్లుకుంటారు. అనంతరం ఇంటిని పూలతో, రంగోలీలతో అలంకరిస్తారు. ఆ తర్వాత దేవుడికి పూజలు చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నూనెతో స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook