Ugadi 2023 predictions For Vrushabha Rashi : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ దగ్గరకు వచ్చేసింది. ఇక ఉగాది పండుగ అనగానే చాలా మంది తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం మాకు కలిసి వస్తుందా లేదా? వంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఉగాది నుంచి వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా? లేదా? వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదాలు, రోహిణి నక్షత్రం లోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందకు వస్తారు. వృషభ రాశి వారికీ 2023 సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11గా ఉంటుంది, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉండనుందని అంటున్నారు. ఈసారి జరగనున్న గ్రహ సంక్రమణల వల్ల ఈ సారి వృషభ రాశి జాతకులకు కొన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి జాతకులకు ఉద్గది తరువాత ఆదాయంలో స్థిరమైన పెరుగుదల ఉన్నప్పటికీ వారు ఆశించిన మేరకు ఫలితాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వృషభ రాశి వారు ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిదట. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ఖర్చు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండాలని అంటున్నారు. ఈ రాశి వారు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఉద్యోగస్తులు వారి ప్రతిభను సామర్ధ్యాలను ప్రదర్శించి విజయాన్ని సాధిస్తారని, పదోన్నతులు లభించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇకసొంత వ్యాపారం చేయాలనుకున్న వారికి ఉగాది మంచి సమయం అని, అయితే కొత్త ఆలోచనలతో వ్యాపారం చేసినప్పుడే అది సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో అటూ ఇటుగా ఉంటుందని, అనేక మానసిక సమస్యలు ఎదుర్కోవడంతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని అందుకే రెగ్యులర్ హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని చెబుతున్నారు.
వృషభ రాశి వారికి కుటుంబ సంబంధాలలో కొన్ని బేధాభిప్రాయాలు రావచ్చు, అందుకే వారితో వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండాలి అని అంటున్నారు. ఉగాది తరువాత కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది, అలాగే వృషభ రాశి వారు వివాహం చేసుకోవడానికి అనుకూలం కాదని అంటున్నారు. ఇక ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి కష్టపడి చదవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Also Read: Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఇలా మాత్రం అసలు చేయకండి!
Also Read: Surya Gochar 2023: సూర్యుడి గమనంలో పెను మార్పు.. రేపటి నుండి ఈ రాశులకు కష్టాలు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook