Ugadi Horoscope 2023: హిందువులందరికీ ఎంతో ఇష్టమైన ఉగాది పండగ ఈ నెల మార్చి 22 వస్తోంది. అంతేకాకుండా ఈ పండగను కొత్త సంవత్సరంగా భావిస్తారు. అయితే ఇదే రోజున పలు గ్రహాలు రాశులు కూడా మారబోతున్నాయి. దీని కారణంగా బుద్ధాదిత్య రాజయోగం, గజకేసరి రాజయోగం ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా దీని కారణంగా పలు రాశులవారి జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి. మార్చి 22న మీన రాశిలో బృహస్పతితో పాటు సూర్యుడు, బుధుడు, చంద్రుడు గ్రహాలు ఉంటాయి. కాబట్టి పలు రాశులవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే పండగ వేళ ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పూట ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మిథునం:
నూతన సంవత్సరం మిథున రాశివారికి చాలా లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉండబోతున్నాడు. మరో వైపు సూర్య గ్రహం కూడా అనుకూలంగా ఉండడం వల్ల చాలా ఫలప్రదంగా ఉండబోతోంది. నిరుద్యోగులు ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగే ఛాన్స్ ఉంది. కొందరికైతే పదోన్నతులు కూడా లభిస్తాయి. వ్యాపారులు విస్తరించుకోవాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో వ్యాపారాలు విస్తరించుకోవడం వల్ల విపరీతమైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశాలున్నాయి.
సింహ రాశి:
ఉగాది మాసంలో సింహ రాశి వారి జీవితం కీలక మలుపులు తిరగబోతోంది. వీరికి ప్రయోజనాలు కలిగే రోజులు ఉగాది మాసం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రాశివారికి అష్టమ భాగంలో బుధాదిత్య, గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. పరిశోధన రంగానికి సంబంధించిన వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. ఈ క్రమంలో నిపుణులకు అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రాశివారు ఏదైనా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు అధిక పరిమాణంలో లాభాలు పొందే అవకాశాలున్నాయి.
ధనుస్సు రాశి:
ఈ రాశివారికి నాల్గవ స్థానంలో 2 రాజయోగాలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఉగాది నుంచి సంవత్సరం కాలం పాటు శుభప్రదంగా, ఫలవంతంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాధుల నుంచి ఉపశమనం లభించబోతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తే మంచి ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాకుండా వారసత్వ ఆస్తిని పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ పెట్టుబడులు పెడితే మంచి భారీ మొత్తంలో లాభాలు పొందుతారు.
Also Read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook