Budh Gochar in Kanya Rashi: ఒకే రాశిలో కొన్ని గ్రహాల కలయిక కారణంగా యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే త్వరలోనే కన్యా రాశిలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ప్రస్తుతం కన్యారాశిలో కుజుడు, సూర్యుడు సంచారం చేశాడు. అక్టోబర్ 1న గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. త్రిగ్రాహి యోగం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక యోగా ప్రభావం:
మిథున రాశి:
మిథున రాశి వారికి కన్యారాశిలో త్రిగ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ కాలంలో, మీరు ఆర్థిక లాభం కోసం పుష్కలంగా అవకాశాలను పొందుతారు.చాలా కాలంగా ప్రమోషన్ మరియు ఆదాయం పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది.ఈ కాలంలో అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.మొత్తంమీద, ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
సింహ రాశి:
త్రిగ్రాహి యోగం కారణంగా సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ సమయంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో వీరు ఆనందంగా ఉంటారు.
ధనుస్సు రాశి:
కన్యారాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు బిజినెస్‌లు ప్రారంభించడం వల్ల వ్యాపారాల్లో విస్తరణ పొందుతారు. అంతేకాకుండా విద్యార్థులు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు కూడా వింటారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి