Trigrahi Yog: శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పాటు.. ఈ 4 రాశుల వారు కుబేరుడికి స్వాగతం పలకబోతున్నారు..

Trigrahi Yog In Meena Rashi: మీనరాశిలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మూడు గ్రహాలు కలిసాయి. దీని కారణంగా ఎంతో ప్రభావంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పని ఊహించని లాభాలు పొందబోతున్నారు. ఆ రాశుల వారు ఎవరో, వారికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 15, 2024, 09:34 PM IST
Trigrahi Yog: శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పాటు.. ఈ 4 రాశుల వారు కుబేరుడికి స్వాగతం పలకబోతున్నారు..

Trigrahi Yog In Meena Rashi: కొన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయడం కారణంగా యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలకు రారాజైన సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేశాడు అయితే ఇప్పటికే అదే రాశిలో  రాహు కలయిక జరిగింది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగంతో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడబోతున్నాయి. అయితే ఈ రాజయోగాల ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి 15 రోజులపాటు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయితే ఈ ప్రత్యేక యోగాల కారణంగా ఏయే రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి:
మకర రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో చేసిన శ్రమకు గాను ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఆశించిన లాభాలు కూడా పొందుతారు. దీంతోపాటు ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టి ధార్మిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. దీంతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీరికి ఈ సమయంలో సమాజంలో మంచి గుర్తింపు లభించడమే, కాకుండా అధికారుల చేత ప్రశంసలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రెండు ప్రత్యేక యోగాల కారణంగా వీరికి ఆధ్యాత్మిక పనులపై ఎక్కువగా ఆసక్తి పెరిగి, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే ఇతరుల నుంచి ఆశించిన డబ్బు కూడా పొందుతారు. ఇక ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న ఆస్తులు కూడా ఈ సమయంలో తిరిగి వస్తాయి. దీంతోపాటు వీరికి సమాజంలో గౌరవం లభించి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

కన్యా రాశి:
ఈ రెండు ప్రత్యేక యోగాల కారణంగా ఏర్పడే ప్రభావం కన్యా రాశి వారిపై కూడా సమానంగా పడబోతోంది. దీని కారణంగా వీరికి ఆర్థిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపార పరిస్థితి కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంత మెరుగుపడతాయి. ఇక పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం గడుపుతున్న వారికి కూడా ఈ సమయం కొంత శుభప్రదంగా ఉంటుంది. దీంతోపాటు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మద్దతు లభించి, అనుకున్న పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 

మీనరాశి:
ఈ రెండు ప్రత్యేక యోగాల ప్రభావం మీన రాశి వారిపై కూడా సానుకూలంగా పడబోతోంది. దీని కారణంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరి శత్రువులు ఓడిపోవడమే కాకుండా మళ్లీ జోలికి రాకుండా ఉంటారు. అంతేకాకుండా రాజకీయ జీవితం గడుపుతున్న వారికి తప్పకుండా పార్టీ అధికారుల మద్దతు లభిస్తుంది అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి కూడా లభించే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీన రాశి వారికి సామాజిక హోదాతో పాటు సమాజంలో మంచి గౌరవం, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో కలిసి వస్తుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News