Luckiest Zodiac Sign: ఈరోజే 3 అతి శక్తివంతమైన రాజయోగాలు ఏర్పాటు.. ఈ రాశుల వారికి డబ్బు పరంగా తిరుగు ఉండదు..

Top 5 Most Luckiest Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఈరోజు ఏర్పడబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశి వారిపై ప్రత్యక్ష ప్రభావం పడి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 10:30 AM IST
 Luckiest Zodiac Sign: ఈరోజే 3 అతి శక్తివంతమైన రాజయోగాలు ఏర్పాటు.. ఈ రాశుల వారికి డబ్బు పరంగా తిరుగు ఉండదు..

 

Top 5 Most Luckiest Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో ఈరోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్ర బుధ గ్రహాలు మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాయి అయితే ఈ రోజే కుజుడు ధనస్సు రాశిలోకి సంచారం చేశాడు. ఇప్పటికే ధనస్సు రాశిలో సూర్య గ్రహం ఉండడం వల్ల కుజుడి సంచారంతో రెండు గ్రహాలు కలువబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. అయితే ఈరోజు కూడా ఈ సూర్య పూజ గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతోపాటు సూర్య, బుధ సంయోగం కారణంగా బుధాదిత్య రాజయోగంతో పాటు బ్రహ్మయోగం ఏర్పడబోతున్నాయి. ఈ రెండు శక్తివంతమైన రాజయోగాల ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై సమానంగా పడబోతోంది. ముఖ్యంగా జాతకంలోని ఈ రెండు రాజయోగాలు శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల లాభాలు కలగబోతున్నాయి. ఈ రెండు రాజయోగాల కారణంగా ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
డిసెంబర్ 27వ తేదీన మేష రాశి వారికి బ్రహ్మ యోగం కారణంగా అనేక రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తండ్రి నుంచి వచ్చే ఉమ్మడి ఆస్తుల కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉంటారు. ఇక ఉద్యోగాలు చేసే వారైతే కార్యాలయంలో మంచి పేరు పొందుతారు. తోబుట్టులతో ఉన్న వివాదాలన్ని ఈ సమయంలో పరిష్కారమవుతాయి. బంధువుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి.

మిథున రాశి:
ఈ ప్రత్యేక యోగాల కారణంగా మిధున రాశి వారికి కూడా ఈరోజు నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీని కారణంగా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. మీలో కొత్త శక్తి ఏర్పడి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంటర్వ్యూలో విజయాలు సాధించే అవకాశాలున్నాయి. సోదరుల సపోర్ట్ లభించి కొన్ని పనులు తేలికగా చేయగలుగుతారు. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

కర్కాటక రాశి:
ఈరోజు ఏర్పడబోయే కొన్ని ప్రత్యేక రాజయోగాల కారణంగా కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఇంతకుముందు పెట్టిన పెట్టబడును లాభాలతో తిరిగి వస్తాయి. కుటుంబ సభ్యులతో కూడా చాలా సరదాగా గడుపుతారు. దీంతోపాటు మీ భాగస్వామితో ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో గొప్ప ఉపవాసం కూడా లభిస్తుంది.

తులారాశి:
తులా రాశి వారికి కూడా ఈ రోజు నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ రాశి వారు గొప్ప లాభాలు పొందుతారు. దీంతో పాటు వినాయకుడి అనుగ్రహం లభించి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను దూరం అవుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. ఇంతకుముందు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో ఉపశమనం లభించి..రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని లాభాలు కంటే ఎక్కువ పొందుతారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News