Surya Rashi Parivartan 2022: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో రాశులు మారుతాయని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. అయితే గ్రహాల్లో సూర్యుడు తన రాశిని వదిలి ఒక నెల రోజుల పాటు వేరే రాశిలోకి వెల్లబోతున్నారు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలో సంచరబోతున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని రాశులవారు అనుకోని విజయాలు సాధిస్తారని జోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు అయితే ఈ రోజు అర్థరాత్రి నుంచి తులా రాశిలోకి సంచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంచారం కారణంగా వివిధ రాశి చక్రాల్లో మార్పులు రాబోతున్నాయి. కాబట్టి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందగలుగుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
ఈ రాశులకు శుభప్రదం:
వృషభం:
వృషభ రాశి వారికి సూర్య సంచారము చాలా ప్రయోజనకరంగా ఉండొచ్చ. ఈ రాశులవారు కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ క్రమంలో శుభపరిణామం రాబోతున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు త్వరలోనే ఉద్యోగాలు పొందుతారు. అంతేకాకుండా వీరు వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక స్థితిగతులు బలపడుతాయి.
సింహ రాశి :
గ్రహ సంచారం వల్ల ఈ రాశిలో కూడా మార్పులు రాబోతున్నాయి. ఈ క్రమంలో వీరు మంచి లాభాలు పొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా సంతోషకరమైన జీవితం గడిపే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీరు వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. అయితే వ్యాపారాలు చేసే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సూర్యు గ్రహా సంచారం వల్ల శుభ ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో డబ్బు, గౌరవం, పదవి అన్ని సమానంగా పొందుతారని శాస్త్రం చెబుతోంది. వీరు కొంచెం కష్టపడితే జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లే అవకాశాలున్నాయి.
మకర రాశి:
సూర్యు గ్రహం స్థానం మారడం వల్ల మకర రాశి కూడా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరికి కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ఈ క్రమంలో వీరి ఎలాంటి ప్రమోషన్ లభించవు. కాబట్టి వేచి చూడడం అంత మంచిది కాదు. వీరు ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు. పెట్టుబడుతు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook